Nigeria: నైజీరియాలో మారణహోమం.. చర్చిపై ఉగ్రదాడి.. 50 మంది మృత్యువాత!

|

Jun 06, 2022 | 8:24 AM

నైజీరియాలో(Nigeria) పెను విషాదం చోటు చేసుకుంది. ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుళ్లలో భారీ సంఖ్యలో మృత్యువాత పడ్డారు. దాదాపు 50 మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఆదివారం ఓ చర్చిలో...

Nigeria: నైజీరియాలో మారణహోమం.. చర్చిపై ఉగ్రదాడి.. 50 మంది మృత్యువాత!
Nigeria
Follow us on

నైజీరియాలో(Nigeria) పెను విషాదం చోటు చేసుకుంది. ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుళ్లలో భారీ సంఖ్యలో మృత్యువాత పడ్డారు. దాదాపు 50 మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఆదివారం ఓ చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్న తరుణంలో ముష్కరులు మారణహోమం సృష్టించారు. తుపాకులు, బాంబులతో విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు హతమార్చారు. మృతి చెందిన వారిలో చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒండో రాష్ట్రంలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ క్యాథలిక్‌ చర్చిలో ఈ దారుణం జరిగింది. ఆదివారం కావడంతో ప్రార్థనల కోసం భారీగా ప్రజలు ఇక్కడికి వచ్చారు. చర్చి ప్రధాన పాస్టర్‌ను ముష్కరులు అపహరించి, కాల్పులు జరిపారు. కాగా.. సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రక్తసిక్తమైన ప్రాంతంతో ఘటన జరిగిన స్థలం భయానకంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి