Earthquake: నేపాల్‌లో భూకంపం.. 5.2గా తీవ్రత నమోదు.. భయాందోళనలో ప్రజలు

నేపాల్‌లో మరోసారి భూకంపం సంభవించింది. నేపాల్ దేశంలోని లోభూజ్యా ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి..

Earthquake: నేపాల్‌లో భూకంపం.. 5.2గా తీవ్రత నమోదు.. భయాందోళనలో ప్రజలు
Earthquake

Updated on: Feb 02, 2021 | 10:05 AM

Earthquake in Nepal: నేపాల్‌లో మరోసారి భూకంపం సంభవించింది. నేపాల్ దేశంలోని లోభూజ్యా ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి భూ ప్రకంపనలు సంభవించాయి. మంగళవారం తెల్లవారుజామున 2.31గంటలకు భూకంపం సంభవించిందని.. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైందని యూస్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం 22.15 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఎలాంటి వార్తలు రాలేదు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా.. నేపాల్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా పలుసార్లు భూమి కంపించింది. 2015లో సంభవించిన భారీ భూకంపంతో దాదాపు 9వేల మంది మృతి చెందగా… 22వేల మంది వరకు గాయపడ్డారు.

Also Read:

Union Budget 2021: మూడో రోజు కొనసాగనున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. రైతుల ఆందోళనపై చర్చ జరపాలని డిమాండ్‌

Crime News: ఆస్తి తగాదాలు.. మాజీ మంత్రి కోడలు, మనవరాలిని దారుణంగా చంపిన దుండగులు..