Blast: బుర్కినా ఫాసోలో ఉగ్రవాదుల దుశ్చర్య.. IED పేలుడులో 35 మంది పౌరుల మృతి.. మరో 37 మందికి

|

Sep 06, 2022 | 9:04 AM

పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో పేలుళ్లతో ఉలిక్కిపడింది. బుర్కినా ఫాసోలోని ఉగ్రవాద ప్రభావిత ప్రాంతంలో జరిగిన భారీ పేలుడులో 35 మంది పౌరులు మృతి చెందారు.

Blast: బుర్కినా ఫాసోలో ఉగ్రవాదుల దుశ్చర్య.. IED పేలుడులో 35 మంది పౌరుల మృతి.. మరో 37 మందికి
Burkina Faso Ied Blast
Follow us on

Burkina Faso IED blast: పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో పేలుళ్లతో ఉలిక్కిపడింది. బుర్కినా ఫాసోలోని ఉగ్రవాద ప్రభావిత ప్రాంతంలో జరిగిన భారీ పేలుడులో 35 మంది పౌరులు మృతి చెందారు. మరో 37 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. కాన్వాయ్‌లోని ఓ వాహనం ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) ని ఢీకొట్టడంతో ఈ మరణాలు సంభవించాయని అక్కడి అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ AFP నివేదించింది. పౌరులతో వెళ్తున్న వాహనం ఒకటి పేలుడు పదార్థాన్ని ఢీకొట్టిందని.. దీంతో 35 మంది మరణించగా.. 37 మంది గాయపడ్డారని గవర్నర్ రోడోల్ఫ్ సోర్గో ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంఘటన జిబో, బౌర్జాంగా మధ్య జరిగిందని వెల్లడించారు. వెంటనే బాధితులకు సహాయం చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు.

కాగా, గత కొన్ని రోజులుగా బుర్కినా ఫాసోలో హింసాకాండతో భద్రతా పరిస్థితి దిగజారింది. అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న జిహాదీల నేతృత్వంలో ఈ పోరాటం ఉత్తర, తూర్పు ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. జిహాదిస్ట్ దాడులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్ష మద్దతుదారులు రాజధాని ఔగాడౌగౌలో ప్రదర్శన కూడా నిర్వహించారు.

పెరుగుతున్న హింస..

ఇవి కూడా చదవండి

ఆగస్టు ప్రారంభంలో అదే ప్రాంతంలో డబుల్ ఐఇడి పేలుడులో 15 మంది సైనికులు మరణించారు. ఉత్తరాదిలోని ప్రధాన నగరాలు – డోరి, జిబోలకు వెళ్లే మార్గాల్లో జిహాదిస్ట్ గ్రూపులు దాడులను నిర్వహిస్తున్నాయి.

2021 నుంచి నిరంతరం జరుగుతున్న దాడులతో 2వేల మంది కంటే ఎక్కువ మంది పౌరులు మరణించగా.. లక్షలాది మంది ఆయా ప్రాంతాలను విడిచిపెట్టి వలస వెళ్లినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..