ఇంత మంది జనం జనం కిటకిటలాడుతున్నారంటే కచ్చితంగా క్రికెట్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నారా? లేదంటే ఫుడ్ ఫెస్టివల్ ఏమో, ఎవరైనా సెలబ్రిటీ వస్తున్నారేమోనని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. వచ్చింది క్రికెట్ స్టేడియంకేగానీ క్రికెట్ చూడటానికి మాత్రం కాదు. ఎందుకంటే వీరంతా నిరుద్యోగులు. మీరు సరిగ్గానే విన్నారు.. వచ్చిన వారంతా నిరుద్యోగులే. ఎందుకొచ్చారబ్బా..? అని మళ్లీ సందేహంలో తలమునకలైపోతున్నారా..! పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష నిర్వహిస్తున్నారట.. దీంతో అందరికీ ఇలా క్రికెట్ స్టేడియంలో రాత పరీక్ష ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఇంతమంది వచ్చారంటే ఖచ్చితంగా పోస్టులు వేలలో ఉండి ఉంటాయని అనుకుంటే.. మళ్లీ తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఉన్నది 11 వందల ఉద్యోగాలు.. పోటీపడుతోంది 30 వేల మంది. అదేంటి..? పరీక్ష కేంద్రాల్లో విడివిడిగా రాత పరీక్ష పెడతారు కదా.. సామూహిక భోజనాలు పెట్టినట్లు, సామూహికంగా పరీక్షలు పెట్టడం ఏంటి అనే సందేహం కలుగుతోంది కదా! ఐతే ఈ పరీక్షలు జరుగుతోంది మనదేశంలో మాత్రం కాదులే.. మన పొరుగుదేశంలో నిరుద్యోగ సమస్యలకు ఇదో తార్కానం మాత్రమే.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో 1,167 పోలీసు ఉద్యోగాలకు నిర్వహిస్తున్నా రాత పరీక్ష కోసం ఏకంగా 32,000 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. తాజాగా పాక్‌లో నెలకొన్న తీవ్ర ఆర్ధిక సంక్షోభం రిత్యా అక్కడ నిరుద్యోగం తారా స్థాయికి చేరుకుంది. పాక్ మొత్తం జనాభాలో 31 శాతం మంది నిరుద్యోగులు ఉద్యోగాలులేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ దేశ నిరుద్యోగుల్లో 51 శాతం మహిళలు, 16 పురుషులు ఉన్నారు. పాకిస్తాన్ జనాభాలో 60 శాతం మంది 30 ఏళ్లలోపు వారే కావడం మరో విశేషం. తాజాగా చేపట్టిన పోలీస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పరీక్షలు కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్న ఆ దేశ ప్రభుత్వం ఇలా అందరినీ ఒకే స్టేడియంకు పిలిచి రాత పరీక్ష నిర్వహించింది. దీంతో దరఖాస్తు చేసుకున్నవారంతా పెన్నులు, ప్యాడ్‌లు పట్టుకుని వచ్చి స్టేడియంలో నేలపైనే కూర్చుని పరీక్ష రాశారు. పాక్ నిరుద్యోగ రేటు 5.3గా ఉంది. ప్రస్తుతం పాక్ నిరుద్యోత సంక్షాభానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
More than 30,000 male and female candidates from all over Pakistan are taking the exam in the stadium for the recruitment of vacant posts in the Islamabad Police. pic.twitter.com/eozxJP4KfH
— hurriyatpk (@hurriyatpk1) December 31, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.