3000 Year Golden City: పురాతత్వ శాస్త్రవేత్తల బృందం చరిత్రకు సాక్ష్యంగా నిలిచే అత్యంత పురాతనమైన బంగారు నగరాన్ని గుర్తించారు. ఇది ‘లాస్ట్ గోల్డెన్ సిటీ’ అనే పేరుగల 3 వేల ఏళ్ల కిందటి పట్టణం. ఇసుక కింద సమాధి అయిపోయిన ఈ నగరాన్ని ఈజిప్టుకు దక్షిణాన గల లక్సోర్‌లో బయల్పడింది. ఎన్నో దేశాలకు చెందిన ఎంతో మంది పురాతత్వ శాస్త్రవేత్తలు ఇంతకముందు ఎన్నో తవ్వకాలు చేపట్టినా.. ఆ నగరాన్ని గుర్తించలేకపోయారు. కానీ, ఈజిప్ట్ సైంటిస్టులు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. అంతేకాదు.. ఆ నగరంలోని కొన్ని అద్భుత ఘట్టాలను కూడా వెలికితీయగలిగారు.
‘లాస్ట్ సిటీ’గా పిలివబడుతన్న ఈ పట్టణం పేరు ‘అటెన్’. ఈ నగరంలో కొన్ని గోడలు దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉన్నాయి. 3 వేల ఏళ్లు దాటినా ఆ నగరపు గోడలు చెక్కు చెదరని స్థితిలో ఉన్నాయి. నగరం దక్షిణ భాగంలో, పురావస్తు శాస్త్రవేత్తలు ఆహారాన్ని నిల్వ చేయడానికి కుండలు, ఓవెన్‌లు ఉన్న బేకరీతో పాటు పెద్ద వంటగదిని కనుగొన్నారు. అలాగే సమాధులు, నివాస సముదాయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. దానికి సంబంధించిన వివరాలను ప్రముఖ చరిత్రకారుడు, పురాతత్వ శాస్త్రవేత్త జాహీ హవాస్ వెల్లడించారు. ఆయన ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం ఈ నగరాన్ని గుర్తించింది.
అలాగే రాజుల లోయగా పిలిచే లగ్జర్ కు దగ్గర్లో గుర్తించినట్టు చెప్పారు. ఈ నగరం కింగ్ అమెనోటెప్ 3 కాలానికి చెందినదని జాహీ హవాస్ వెల్లడించారు. దాదాపు ఏడు నెలల పాటు సాగిన తవ్వకాల్లో నగరంతో పాటు ఎన్నో ఆభరణాలు, ఆనవాళ్లు, మట్టి ఇటుకలను వెలికి తీశారు. ఆ ఇటుకలపై కింగ్ అమెనోటెప్ 3 చిత్రాలు ముద్రించి ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈజిప్ట్ లో ఇప్పటిదాకా గుర్తించిన పురాతన నగరాల్లో ఇదే అతిపెద్దదని సమాచారం. అలాగే ఆ నగరంలో నివాస సముదాయాల్లోని ఇళ్లలో అప్పటి ప్రజలు వాడిన పనిముట్లు, మట్టి పొయ్యిలు, కుండలు, నాటి మనుషుల అస్థిపంజరాలను గుర్తించారు.
Also Read: మైనోపాజ్ దశలో ఉన్న మహిళలకు చేమదుంపలు చేసే మేలు తెలిస్తే..
గుప్త నిధులు దొరికితే.. ఆ నిధి ఎవరికి చెందుతుంది… ఎలా పంచుతారంటే..!