Thailand Train Accident: థాయిలాండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 22 మంది మృతి..

థాయిలాండ్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రైలుపై ఓ క్రేన్‌ జారిపడింది.. దీంతో ట్రైన్ పట్టాలు తప్పి ప్రమాదం జరిగింది. మీడియా నివేదికల ప్రకారం సుమారు 22 మంది మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం బ్యాంకాక్‌ నుండి 230 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ప్రమాద సమయంలో రైలులో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు.

Thailand Train Accident: థాయిలాండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 22 మంది మృతి..
Thailand Train Accident

Updated on: Jan 14, 2026 | 10:51 AM

థాయిలాండ్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రైలుపై ఓ క్రేన్‌ జారిపడింది.. దీంతో ట్రైన్ పట్టాలు తప్పి ఘోర ప్రమాదం జరిగింది. మీడియా నివేదికల ప్రకారం సుమారు 22 మంది మృతిచెందారు. 40 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదం బ్యాంకాక్‌ నుండి 230 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ప్రమాద సమయంలో రైలులో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

బ్యాంకాక్ నుంచి థాయిలాండ్ లోని ఈశాన్య ప్రావిన్స్ కు వెళ్తున్న రైలు పై నిర్మాణ క్రేన్ పడింది.. దీంతో ట్రైన్ పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. బ్యాంకాక్ కు ఈశాన్యంగా 230 కి.మీ (143 మైళ్ళు) దూరంలో ఉన్న నఖోన్ రాట్చసిమా ప్రావిన్స్ లోని సిఖియో జిల్లాలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

“ఇరవై రెండు మంది మరణించారు, 30 మందికి పైగా గాయపడ్డారు” అని నఖోన్ రాట్చసిమా ప్రావిన్స్‌లోని స్థానిక పోలీసు చీఫ్ థాచపోన్ చిన్నవాంగ్ వార్తా సంస్థ AFP కి తెలిపారు.

ఆ రైలు థాయిలాండ్‌లోని ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్‌కు వెళుతోంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ఒక క్రేన్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుపై పనిచేస్తుండగా, అది కూలిపోయి ప్రయాణిస్తున్న రైలును ఢీకొట్టింది.

దీని వల్ల రైలు పట్టాలు తప్పింది.. కొద్దిసేపు మంటలు చెలరేగాయి. సహాయక చర్యలు జరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో గాయపడిన వారిని రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..