Wooden Chair: అదృష్టం అనేది ఎప్పుడు ఎవర్ని ఏ రూపంలో వరిస్తుందో ఎవరీకి తెలీదు.. లక్ మన తలపులు తట్టినప్పుడు ..దానిని అందిపుచుకున్న వారే నిజమైన అదృష్టవంతులు. అలా ఓ మహిళ లక్ ..టక్ టక్ మని తలుపు తట్టగానే టపీమని తీసింది. లక్షలు తన ఖాతాలో వేసుకుంది. పాత కుర్చీతో ఏకంగా లక్షదికారి అయిపొయింది ఇప్పుడు బ్రిగ్టన్(Brighton)కు చెందిన ఓ మహిళ.. పాత సామాన్లు అమ్మే ఓ షాపు నుంచి ఓ పాత చెక్క కుర్చీ కొనుక్కుంది. దాని ధర 5 పౌండ్లు.. అంటే మన కరెన్సీలో 500 రూపాయల వరకూ ఉంటుంది. అయితే అప్పుడు దాని విలువ ఆమెకి తెలియదు. ఆమె ఇంట్లో ఆ కుర్చీని చూసిన ఆమె దగ్గరి బంధువు ఆ కుర్చీ మీద రాసిఉన్న డేట్ చూశాడు. అతనికి ఆసక్తిగా అనిపించి దానిపై స్టడీ చేశాడు.
ఆ కుర్చీ 20వ శతాబ్దానికి చెందిన వియన్నా ఎవంట్ గార్డే ఆర్ట్ స్కూల్‌కి చెందినదట. ఆస్ట్రియన్ పెయింటర్ కోలోమన్ మోసర్(Austrian painter Koloman Moser) 1902లో దానిని డిజైన్ చేశాడట. మోడ్రన్ ఆర్ట్ వర్క్‌లో ఆస్ట్రియాలోనే మంచి పేరున్న వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆయన నిచ్చెన తరహా స్టైల్లో పట్టీలను ఉపయోగించి ఆ కుర్చీనీ రూపొందించారు. ఇదంతా కుర్చీ కొన్న మహిళకు ఆమె బంధువు వివరించడంతో ఆ మహిళ ఆ పాత కుర్చీతో ఓ ప్రముఖ వేలం సంస్థను సంప్రదించింది. వాళ్లు దానిని వేలం వేయగా.. ఆస్ట్రియాకు చెందిన ఓ డీలర్ దానిని 16,250 పౌండ్లు.. అంటే భారత దేశ కరెన్సీలో 16 లక్షలకు పైనే చెల్లించి దక్కించుకున్నాడు. కాగా 120 ఏళ్లు గడుస్తున్నా ఆ కుర్చీ ఇంకా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం.
Also Read: