Viral: భరించలేని కడుపు నొప్పి అంటూ ఆస్పత్రిక వచ్చిన వ్యక్తి – CT స్కాన్ తీసిన వైద్యులు షాక్

చైనాలో ఓ వ్యక్తి తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరగా.. వైద్యులు అతడి కడుపులో బతికి ఉన్న ఈల్‌ను కనుగొన్నారు. అది పేగును చీల్చి లోపలికి చొచ్చుకుపోయిన దృశ్యం వైద్యులను షాక్‌కు గురిచేసింది. అత్యవసర శస్త్రచికిత్స ద్వారా ఈ జీవిని బయటకు తీయడంతో వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఈల్‌ శరీరంలోకి ఎలా చేరిందన్నది మాత్రం మిస్టరీగానే మిగిలింది.

Viral: భరించలేని కడుపు నొప్పి అంటూ ఆస్పత్రిక వచ్చిన వ్యక్తి - CT స్కాన్ తీసిన వైద్యులు షాక్
Eel Like Creature

Updated on: Jul 18, 2025 | 3:33 PM

చైనా నుంచి చిత్రవిచిత్రమైన వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా హునాన్ ప్రావిన్స్‌ నుంచి వెలుగులోకి వచ్చిన ఓ కేసు అందరికీ షాక్‌ ఇచ్చింది. ఓ వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా… అతడి పొట్టలో జీవంతో ఉన్న ఒక అడుగు పొడవైన ఈల్‌లాంటి జీవిని గుర్తించారు. ఈ ఘటన వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది.

హునాన్‌ ప్రావిన్స్‌కు చెందిన 33ఏళ్ల వ్యక్తి ఒక్కసారిగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఫస్ట్ అఫిలియేటెడ్ హాస్పిటల్‌ ఆఫ్ హునాన్ మెడికల్ యూనివర్సిటీకి పరుగెత్తాడు. అతడి ముఖం వాడిపోయి ఉంది. చెమటలు పట్టేసాయి. వైద్యులు తక్షణమే సీటీ స్కాన్‌ చేశారు. అందులో కనిపించిన దృశ్యం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్కాన్‌లో వ్యక్తి కడుపులో ఓ బతికున్న జీవి ఉందని గుర్తించారు. ఆ జీవి పేగును తొలచి లోపలికి చొచ్చుకుపోయింది. ఆ ప్రాంతం బలంగా గట్టిగా మారిపోవడంతో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు వైద్యులు అంచనా వేశారు. వెంటనే లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ప్రారంభించారు.

ఈల్‌… పేగులోని సిగ్మాయిడ్ కొలన్‌ను చీల్చేసింది. వెంటనే స్పెషల్ క్లాంప్‌తో దానిని జాగ్రత్తగా బయటకు తీసి.. ఆపై పేగును కుట్టేశారు. శరీరాన్ని శుభ్రంగా కడిగి… మిగతా ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశాలను నివారించారు. సర్జరీ విజయవంతం కావడంతో వ్యక్తి కొన్ని రోజుల చికిత్స తర్వాత కోలుకుని ఇంటికి వెళ్లాడు. ఆ ఈల్‌ అతడి శరీరంలోకి ఎలా చొచ్చుకుపోయింది? అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి