Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

ఏపీ సర్కార్‌‌కు ‘ప్రపంచ బ్యాంక్’ భారీ షాక్

World Bank gives shock to AP Government, ఏపీ సర్కార్‌‌కు ‘ప్రపంచ బ్యాంక్’ భారీ షాక్

ఏపీ సర్కార్‌కు ప్రపంచ బ్యాంక్ భారీ షాక్ ఇచ్చింది. రాజధాని అమరావతి ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంక్ తప్పుకుంది. ఈ మేరకు ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లోని ప్రాజెక్ట్& ఆపరేషన్స్‌ సెక్షన్‌లో ఉన్న అమరావతి నిర్మాణం అనే ప్రాజెక్ట్ స్టేటస్‌లో ‘డ్రాప్డ్’ అంటూ పెట్టేసింది. అయితే దీనిపై ప్రపంచ బ్యాంక్ అధికారుల నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై మానవ హక్కుల ఫోరమ్ అధికారి రోహిత్ గుత్తా మాట్లాడుతూ.. ‘‘నిన్నటి వరకు ఈ ప్రాజెక్ట్ స్టేటస్‌లో ‘ఇన్ పైప్‌లైన్’ అని ఉండేది. అయితే ఇవాళ అందులో ‘డ్రాప్డ్’ అని పెట్టారు’’ అని పేర్కొన్నారు.

మరోవైపు ఈ అంశంపై ఏపీ సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహన్ మాట్లాడుతూ.. ‘‘దీనిపై ప్రపంచ బ్యాంక్‌ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. రుణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రుణాన్ని తీసుకువచ్చేలా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని భావించాం’’ అని పేర్కొన్నారు. అయితే అమరావతి నిర్మాణం కోసం నిధులు కావాలంటూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 2016లో ప్రపంచ బ్యాంక్‌‌కు  ఓ వినతి పత్రాన్ని పంపింది. అందులో భాగంగా 300మిలియన్ డాలర్లు రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఒప్పుకుంది. అలాగే మరో 200మిలియన్ డార్లు ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే రాజధాని కోసం తమ భూములను బలవంతంగా లాక్కున్నారని ఆ మధ్యన కొందరు రైతులు ప్రపంచ బ్యాంక్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేశారు. దీంతో రుణ ప్రక్రియ నిలిచిపోయింది.

అయితే ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దేశ గర్వించదగ్గ రాజధానిగా అమరావతిని నిర్మించాలనుకున్నారు. అయితే రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో రాజధానిని నిర్మించడం వల్ల వరదలు వచ్చే అవకాశం ఉందని, అక్కడి పంట భూములు బీడుగా మారుతాయని, దాదాపు 20వేల కుటుంబాలు రోడ్డున పడుతాయని పలువురు సామాజిక కార్యకర్తలు తమ అభిప్రాయాలను తెలిపిన విషయం తెలిసిందే.