Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • తిరుమల: నేడు ఉదయం 11గంటలకు టిటిడి బోర్డ్ అత్యవసర సమావేశం. తిరుమల కొండపై పదిమంది టిటిడి ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఏమి చేయలనేదానిపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన టిటిడి. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్న టిటిడి.
  • దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 రికవరీ రేటు. 60.8శాతానికి చేరుకున్న కోలుకున్నవారి సంఖ్య. కోలుకున్నవారు 95.48శాతం, మృతుల శాతం 4.52.
  • కృష్ణా జిల్లా : కొల్లు రవీంద్రను వీడియో కాన్పిరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు‌ హాజరుపరిచిన పోలీసులు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఇంటి నుంచే న్యాయమూర్తి కేసు విచారణ. కొనసాగుతున్న విచారణ. వీడియో కాన్పిరెన్స్ లో విచారణ అనంతరం న్యాయమూర్తి కొల్లు రవీంద్రకు రిమాండ్ విధించే అవకాశం.
  • నిర్మాత పోకూరి రామారావు ఈరోజు ఉదయం కరోన కారణంగా మృతి చెందారు. పోకూరి రామారావు పోకూరి బాబురావు సోదరుడు. ఈతరం ఫిలిమ్స్ లో ఎన్నో చిత్రాలు తీశారు.
  • ఇంజనీరింగ్ విద్యార్థిని అశ్లీల చిత్రాలు ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసిన విద్యార్థిని గుర్తించిన పోలీసులు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆ యువకుడికి వీడియోలు ఎలా వచ్చాయన్న కోణంలో విచారణ. ఆ యువకుడు మరికొంతమందికి వీడియోస్ షేర్ చేసినట్లు గుర్తించిన పోలీసులు. కేసులో కొనసాగుతున్న విచారణ
  • తెలంగాణ లో రికార్డు స్థాయిలో కేసులు. రాష్ట్రంలో 20 వేలు, హైదరాబాద్ లో 16 వేలు దాటిన పాజిటివ్ కేసులు. లక్ష దాటిన కరోనా టెస్టింగ్ లు. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 1892 కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు- 20,462. జిహెచ్ఎంసి పరిధిలో ఒక్క రోజు 1658 కేసులు. Ghmc లో 16, 219కు చేరుకున్న కేసులు. 283 కి చేరుకున్న కరోనా మరణాలు. చికిత్స పొందుతున్న వారు- 9984. డిశ్చార్జి అయిన వారు -10195.
  • జీవీకే కుంభకోణంపై ఈడీ ఆరా. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తమకివ్వాలని ఈడీ లేఖ. జీవీకే స్కాంపై ప్రాథమిక సాక్ష్యాలు సేకరిస్తున్న ఈడీ.

టాలీవుడ్‌లో రాజమౌళికి ఇష్టమైన డైరెక్టర్ ఎవరంటే?

లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ బంద్ చేసి ఇంట్లోనే ఉంటున్నారు డైరెక్టర్ రాజమౌళి. తాజాగా జక్కన్న టీవీ-9కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల గురించి చెప్పుకొచ్చారు. అలాగే తన కెరీర్ సంగతులతో పాటు ఆర్ఆర్ఆర్ మూవీ ముచ్చట్లను..
Who is Rajamouli's Favorite Director in Tollywood?, టాలీవుడ్‌లో రాజమౌళికి ఇష్టమైన డైరెక్టర్ ఎవరంటే?

లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ బంద్ చేసి ఇంట్లోనే ఉంటున్నారు డైరెక్టర్ రాజమౌళి. తాజాగా జక్కన్న టీవీ-9కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల గురించి చెప్పుకొచ్చారు. అలాగే తన కెరీర్ సంగతులతో పాటు ఆర్ఆర్ఆర్ మూవీ ముచ్చట్లను కూడా పంచుకున్నారు. అందులో హీరో మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌ చరణ్ గురించి చాలా విషయాలు పేర్కొన్నారు. అలాగే టాలీవుడ్‌లో దర్శకధీరుడు రాజమౌళికి ఇష్టమైన డైరెక్టర్‌ ఎవరో కూడా తెలిపారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తరువాత మహేష్‌తో సినిమా చేయబోతున్నట్లు సంచలన ప్రకటన చేసిన రాజమౌళి.. అలాగే జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన మొదటి సినిమాకి తారక్‌ లాంటి హీరో దొరికాడని అందుకు చాలా ఫీల్ అయినట్లు రాజమౌళి తెలిపారు. అంతేకాకుండా పైకి కనిపించే ప్రభాస్ వేరు.. లోపల ఉండే ప్రభాస్ వేరని అన్నారు. అలాగే తనకు టాలీవుడ్‌లో దర్శకుడు సుకుమార్ అంటే చాలా ఇష్టమని.. అతని టేకింగ్ చాలా బావుంటుందని చెప్పుకొచ్చారు డైరెక్టర్ రాజమౌళి.

Read More: 

ఇంటర్‌ సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌.. టీఎస్ బోర్డు కీలక నిర్ణయం

ఫేస్‌బుక్‌లో అభ్యంతకర వ్యాఖ్యలు.. ‘రక్త చరిత్ర’ నటుడు అరెస్ట్

రేపటి నుంచి లాక్‌డౌన్ సడలింపులు.. ఏం తెరుచుకుంటాయంటే!

Related Tags