Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 31 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 131868. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 73560. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 54441. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 3867. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 41 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1854 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ నలుగురు మృతి. మొత్తం ఇప్పటివరకు 53 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 709 మంది చికిత్స పొందుతున్నారు.
  • తిరుమల: ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల రుసుము రీఫండ్. జూన్ 30వ తేది వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శన టికెట్లు, తిరుమలలో గదులు బుక్ చేసుకున్న భక్తులకు డబ్బులు రీఫండ్. టికెట్ల వివరాలను refunddesk_1@tirumala.org మెయిల్ ఐడీకి పంపాలని భక్తులను కోరిన టీటీడీ.
  • వరంగల్ 9 మర్డర్ కేసు లో సంచలన బ్రేకింగ్ . 9 మందిని హత్య చేసింది సంజయ్ . మాక్సుద్ భార్య చెల్లెలి తో సంబంధం ఉన్న సంజయ్. మాక్సుద్ భార్య చెల్లలి తో అక్రమ సంబంధం ఉన్న సంజయ్. తనకు అడ్డు రావొద్దని మాక్సుద్ కుటుంబం తో పాటు సన్నిహితంగా ఉన్న బిహారి యువకులను హత్య చేసిన సంజయ్.
  • CRPF జవాన్ లకు కరోనా పాజిటివ్. ఈ రోజు 9 మంది CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 359 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ. 137 యాక్టీవ్ కేస్ లు. 220 మంది డిశ్చార్జ్, ఇద్దరు మృతి.
  • దేశ వ్యాప్తంగా భానుడి భగ భగ. పంజాబ్, హర్యానా, దక్షిణ యుపి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని IMD హెచ్చరిక.. రాబోయే 5 రోజుల్లో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటాయని హెచ్చరిక.

వోడాఫోన్ వినియోగాదారులకు షాకింగ్ న్యూస్..! ఇక భారత్‌కు బైబై..!

Vodafone may leave Indian phone market because losses are mounting, వోడాఫోన్ వినియోగాదారులకు షాకింగ్ న్యూస్..! ఇక భారత్‌కు బైబై..!

ప్రముఖ భారత టెలికాం సంస్థ వోడాఫోన్.. త్వరలో వినియోగదారులకు షాకింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సంస్థ తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతుండటంతో.. ఇక భారత్‌లో సర్వీసులకు బైబై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది. ” వోడాఫోన్ సంస్థ.. ఇక ఎప్పుడో తన మూఠాముల్లె సర్దుకుని భారత్‌కు బైబై చెప్పి వెళ్లిపోవచ్చు” అంటూ ప్రచురించింది. ప్రస్తుతం సంస్థ తీవ్రమైన నష్టాల బాట పట్టడమే ఇందుకు కారణమంటూ పేర్కొంది. అంతేకాదు.. వోడాఫోన్ మార్కెట్ క్యాపిటలైజేషన్.. దిగజారుతుండటం.. నిధుల సమీకరణకు అడ్డంకిగా మారిందని పేర్కొంది.

అయితే ఈ విషయంలో వోడాఫోన్ సంస్థ అధికారికంగా ఏలాంటి ప్రకటనా చేయలేదు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దాదాపు రూ. 4వేల కోట్లకు పైగా నష్టపోయినట్లు వోడాఫోన్ ప్రకటించింది. కాగా, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది దాదాపు రూ. 1300 కోట్లు ఎక్కువ. మరో వైపు రుణ పునవ్యస్థికరణ చేయాలంటూ వోడాఫోన్ రుణదాతలను కోరినట్టు.. ఇటీవలే ఓ వార్త హల్‌చల్ చేసింది. అయితే అప్పట్లో వోడాఫోన్ ఆ వార్తలను కొట్టిపారేసింది. రుణ పునర్వవస్థీకరణ కోసం తాము ఎవరినీ సంప్రదించలేదని, ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే చెల్లింపులు చేస్తున్నామని స్పష్టం చేసింది. అయితే తాజాగా వస్తున్న వార్తలపై వోడాఫోన్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరి కొద్ది రోజులు వేచి చూస్తే అసలు విషయం ఎంటో తెలుస్తుంది.

Related Tags