YS Jagan: జనంలోకి జగన్.. బస్సుయాత్ర రూట్ మ్యాప్ సిద్దం: సజ్జల

ఈ నెల 27 నుంచి జగన్‌ బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌కి నివాళులు అర్పించిన తర్వాత.. అదే రోజు ప్రొద్దుటూరులో యాత్ర ఉంటుంది. 28న నంద్యాలలో బహిరంగ సభ ఉంటుంది. ఇక 30వ తేదీన ఎమ్మిగనూరులో..

Updated on: Mar 19, 2024 | 4:43 PM

ఈ నెల 27 నుంచి జగన్‌ బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌కి నివాళులు అర్పించిన తర్వాత.. అదే రోజు ప్రొద్దుటూరులో యాత్ర ఉంటుంది. 28న నంద్యాలలో బహిరంగ సభ ఉంటుంది. ఇక 30వ తేదీన ఎమ్మిగనూరులో బహిరంగ సభ నిర్వహించేలా పార్టీ ప్లాన్ చేసింది. పాదయాత్ర తరహాలోనే జగన్ ఇకపై పూర్తిగా జనాల్లోనే ఉండబోతున్నారు. సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహా.. రాష్ట్రమంతా జగన్‌ బస్సుయాత్ర ఉంటుంది. జగన్ సభ అంటే తిరునాళ్లలా ఉంటుంది. ఊళ్లకు ఊళ్లే తరలివస్తాయి. గతంలో ఎన్నడూ లేనంతగా జనసమీకరణ ఉంటుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Loading...
Unable to load recommendations.
Follow Us