Hyderabad: కాటేసిన లోన్ యాప్.. వేధింపులకు మరొకరు బలి !!

Updated on: Apr 21, 2022 | 5:51 PM

లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. రుణాలు తీసుకున్న వారిని తీవ్రంగా వేధిస్తున్నారు. వారి వేధింపులకు హైదరాబాద్‌లో మరో యువకుడు బలయ్యాడు.

లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. రుణాలు తీసుకున్న వారిని తీవ్రంగా వేధిస్తున్నారు. వారి వేధింపులకు హైదరాబాద్‌లో మరో యువకుడు బలయ్యాడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ (Hyderabad) లో మంగళవారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ జియాగూడకు చెందిన రాజ్‌కుమార్‌.. ఆన్‌లైన్‌ యాప్‌ (Loan app) లో 12వేల రూపాయల లోన్‌ తీసుకున్నాడు.. EMI ద్వారా 8వేలు చెల్లించాడు. మిగిలిన 4వేలు వెంటనే చెల్లించాలంటూ లోన్‌యాప్‌ నిర్వాహకులు ఒత్తిడి చేశారు. కాగా.. లోన్‌ తీసుకునే సమయంలో ఫ్రెండ్స్‌ ఫోన్‌ నంబర్స్‌ను రాజ్‌కుమార్‌ రిఫరెన్స్‌ కాంటాక్ట్స్‌గా ఇచ్చాడు. దీంతో అతని స్నేహితులకు, కుటుంబసభ్యులకు కూడా కాల్స్‌, మెసేజ్‌లు, ఆడియో రికార్డింగ్స్‌ పెట్టారు. వారికి వరుస కాల్స్, మెసేజ్‌లు రావడంతో చెల్లించాలని రాజ్ కుమార్ ను పలుమార్లు సూచించారు. దీంతో రాజ్ కుమార్ తీవ్ర మనస్తాపం చెందాడు. చివరకు లోన్ యాప్ నిర్వహకుల వేధింపులు తాళలేక.. రాజ్‌కుమార్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Also Watch:

ఇంగ్లీష్ టీచర్ కు ఇదేం పాడు బుద్ది.. సారుగారు చేసిన పనికి చితక బాదిన జనం

తగ్గేదేలే అంటూ.. జిమ్ చేస్తున్న అవ్వ.. ఆశ్చర్యపోతున్న నెటిజెన్స్

కిలాడీ జంట చలాకీ చోరీ !! దొంగతనం స్టైల్ చూస్తే బిత్తరపోవాల్సిందే !!

ఈ రెండు తీసుకోండి చాలు !! బీపీ, గుండెపోటు రమ్మన్నా రావు !!

ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోతున్నారా ?? అయితే ఇలా చేయండి !!