టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ను పోలిన లక్షణాలు
సైలెంట్ కిల్లర్ లాంటి డయాబెటీస్ వ్యాధికి సంబంధించి టైప్ 1, టైప్ 2 గురించి విన్నాం. కానీ ఇందులో మరొకటి కూడా ఉంది. అదే డయాబెటిస్ టైప్ 1.5. ఈ వ్యాధితోనే అమెరికన్ గాయకుడు బాధపడుతున్నాడు. ఒక రకంగా అతని కారణంగానే ఈ డయాబెటిస్ టైప్ 1.5 వెలుగులోకి వచ్చింది. అసలు ఏంటీ వ్యాధి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీన్ని లాడా లేదా లాటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ అని కూడా పిలుస్తారు.
సైలెంట్ కిల్లర్ లాంటి డయాబెటీస్ వ్యాధికి సంబంధించి టైప్ 1, టైప్ 2 గురించి విన్నాం. కానీ ఇందులో మరొకటి కూడా ఉంది. అదే డయాబెటిస్ టైప్ 1.5. ఈ వ్యాధితోనే అమెరికన్ గాయకుడు బాధపడుతున్నాడు. ఒక రకంగా అతని కారణంగానే ఈ డయాబెటిస్ టైప్ 1.5 వెలుగులోకి వచ్చింది. అసలు ఏంటీ వ్యాధి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీన్ని లాడా లేదా లాటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ పోలిన లక్షణాలనే చూపిస్తుంది. ఇది యుక్త వయసులో వచ్చే ఆటో ఇమ్యూన్ కండిషన్. ఇది ఆహారం, జీవనశైలి మార్పులతో సరి అయ్యేది కాదు. దీని ప్రకారం గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారిలో దాదాపు 10% మందికి లాడా ఉంటుందట. చికిత్స చేయకుండా వదిలేస్తే, టైప్ 1.5 డయాబెటిస్ డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌కు దారి తీస్తుంది, ఇది ఇన్సులిన్ లేకపోవడం, కొవ్వును కరిగించడం వంటి వాటికి దారితీసి, చివరికి గ్లూకోజ్‌ను ఇంధనంగా ఉపయోగించలేకపోతుంది. తద్వారా శరీరంలో విషపూరితమైన కీటోన్‌లను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. టైప్ 1.5 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ దెబ్బతిన్నప్పుడు టైప్ 1 మాదిరిగా శరీరం ప్యాంక్రియాటిక్ బీటా కణాలను నాశనం చేస్తుంది. ఈ టైప్ 1.5 మధుమేహం ఉన్న వ్యక్తి ఒకవేళ అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నట్లయితే ఇన్సులిన్ నిరోధకత కూడా ఉండే అవకాశం ఉంటుందన్నారు వైద్యులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైనా కుటిల బుద్ధి.. బ్రహ్మపుత్రపై జలవిద్యుత్ కేంద్రం
Srisailam: శ్రీశైలం డ్యాం దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్