అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి

|

Jan 17, 2024 | 8:37 PM

అమెరికా అధ్యక్ష రేసు నుంచి భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి తప్పుకున్నారు. వ్యాపారవేత్తగా అమెరికన్లకు సుపరిచితుడైన వివేక్.. గతేడాది ఫిబ్రవరిలో సంచలన ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు నేతలతో పోటీపడ్డారు. తన ప్రసంగాలతో అమెరికన్లను ఆకట్టుకుంటూ ప్రచారం హోరెత్తించారు. అయితే, మొదటి నుంచి ట్రంప్ కు వివేక్ అనుకూలంగానే ఉంటూ వచ్చారు.

అమెరికా అధ్యక్ష రేసు నుంచి భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి తప్పుకున్నారు. వ్యాపారవేత్తగా అమెరికన్లకు సుపరిచితుడైన వివేక్.. గతేడాది ఫిబ్రవరిలో సంచలన ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు నేతలతో పోటీపడ్డారు. తన ప్రసంగాలతో అమెరికన్లను ఆకట్టుకుంటూ ప్రచారం హోరెత్తించారు. అయితే, మొదటి నుంచి ట్రంప్ కు వివేక్ అనుకూలంగానే ఉంటూ వచ్చారు. ట్రంప్ ప్రపంచంలోనే అత్యుత్తమ అధ్యక్షుడంటూ వివేక్ ఇటీవల కూడా పొగడ్తలు కురిపించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఉపాధ్యక్షుడిగా ఉండేందుకు సిద్ధమని తన ప్రచారంలోనూ పలుమార్లు ప్రకటించారు. కాగా, అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తాజాగా అయోవాలో ప్రైమరీ ఎన్నికలు జరిగాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్యరాముని పాదాల చెంత వెలిగిన 108 అడుగుల అగరుబత్తి

ఇది అల్లాటప్పా బ్యాగు కాదు.. దీని ఖరీదు తెలిస్తే కళ్లు తేలేస్తారు

అత్తగారింట్లో కొత్త అల్లుడి మర్యాదలు.. ఏకంగా 300 రకాల పిండివంటలతో

తెలుగు నేలపైనే శ్రీరాముని ప్రాణప్రతిష్ట యంత్రం తయారీ

3 గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే విమానం రద్దు