పెద్ద మొత్తంలో బంగారం.. స్విట్జర్లాండ్‌కు తరలించిన మదురో

Updated on: Jan 09, 2026 | 1:49 PM

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురో దాదాపు 113 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ($5.2 బిలియన్లు) స్విట్జర్లాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఆర్థిక సంక్షోభ సమయంలో 2013-2016 మధ్య ఈ తరలింపు జరిగింది. యూరోపియన్ యూనియన్ ఆంక్షల తర్వాత బంగారం ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ తరలింపు శుద్ధి, సర్టిఫికేషన్ కోసమా, లేక మదురో ఆస్తులతో సంబంధం ఉందా అనేది స్పష్టంగా లేదు.

అమెరికాలో బందీగా ఉన్న వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురో పెద్ద మొత్తంలో బంగారాన్ని స్విట్జర్లాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. వాటి విలువ మొత్తం 5.2 బిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.46వేల కోట్లు ఉంటుందని అంచనా. కస్టమ్స్ డేటా ఆధారంగా ఆంగ్ల మీడియా కథనాలు రాస్తున్నాయి. ఆయన తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఆ సమయంలో దాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం బంగారం విక్రయాలు చేస్తున్న సమయంలోనే.. ఈ తరలింపు స్విట్జర్లాండ్‌కు జరిగింది. 2013 నుంచి 2016 మద్య వెనెజువెలా సెంట్రల్‌ బ్యాంకు నుంచి దాదాపు 113 మెట్రిక్‌ టన్నుల విలువైన బంగారాన్ని తరలించారు. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్‌ ఆంక్షలతో 2017 నుంచి 2025 వరకు స్విట్జర్లాండ్‌కు ఎలాంటి బంగారం ఎగుమతులు జరగలేదు. మదురోతో సహా ఆయన సహచరులకు సంబంధించి దేశంలో ఉన్న వారి ఆస్తులను స్తంభింపజేయాలని స్విట్జర్లాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఆస్తులకు, ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ నుంచి స్విస్ బ్యాంక్‌కు తరలివెళ్లిన బంగారానికి లింక్‌ ఏమైనా ఉందా అనే దానిపై స్పష్టత లేదు. శుద్ధి, సర్టిఫికేషన్‌ వంటి వాటి కోసం వెనెజువెలా ఈ బంగారాన్ని తరలించి ఉండొచ్చని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డోపింగ్ టెస్టులో పట్టుబడ్డ క్రికెటర్‌

నాకు మరో భార్య కావాలి.. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి వ్యక్తి హంగామా

ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్‌

అమ్మబాబోయ్‌ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే

ప్రతి నెలా 5 వేల మంది రైడర్లను తొలగిస్తుంటాం.. జొమాటో బాస్ షాకింగ్ ప్రకటన