వెనిజులా సంక్షోభం.. చమురు ధరలు పెరిగేనా ??
అమెరికా-వెనిజులా సంక్షోభం 2026 ప్రారంభంలో ప్రపంచ మార్కెట్‌ను కుదిపేసింది. గోల్డ్, వెండి, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలపై ప్రభావం పడనుంది. చమురు ధరలు తగ్గే అవకాశం ఉండటంతో, రవాణా ఖర్చులు తగ్గి భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని అంచనా. అయితే, సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది.
అమెరికా-వెనిజులా సంక్షోభంతో 2026 ప్రారంభంలోనే పెద్ద ముప్పు వచ్చి పడింది. వెనిజులా సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపనుంది. గోల్డ్, వెండి, క్రూడ్ ఆయిల్ ధరలపై ఎఫెక్ట్ పడనుంది. వీటి ధరలు పెరిగే అవకాశముంది. పెట్రోల్, డీజిల్ ధరలపై అనేక వస్తువుల ధరలు ఆధారపడి ఉంటాయి.చమురు ధరలు తగ్గితే రవాణా ఖర్చులు తగ్గుతాయి. వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రజలపై ధరల భారం తగ్గుతుంది. వెనిజులా క్రూడ్ ఆయిల్ ను ఉత్పత్తి చేస్తుంది. వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికా దళాలు అరెస్ట్ చేసిన వేళ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వెనిజులా ఆయిల్ కంపెనీల్లో అమెరికా పెట్టుబడులు పెట్టనుందని ప్రకటించారు. ప్రస్తుతం వెనిజులా రోజుకు 10 లక్షల బ్యారెల్స్ ఉత్పత్తి చేస్తుండగా భవిష్యత్తులో 30 లక్షల బ్యారెల్స్‌కు పెరిగే అవకాశముంది. అయితే వెనిజులా రోజుకు 10 లక్షల బ్యారల్స్ చమురు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. రోజూ 5 లక్షల బ్యారల్స్ మాత్రమే ఎగుమతి చేస్తోంది. ప్రపంచంలో ఉత్పత్తి చేసే చమురుతో పోలిస్తే ఇది ఒక శాతమే. దీని వల్ల పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపకపోవచ్చని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. అయితే సంక్షోభం ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బారెల్ క్రూడ్ ఆయిల్ ధర 60 డాలర్లుగా ఉంది. రాబోయే రోజుల్లో 53 డాలర్లకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుండటంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే సూచనలు ఉన్నాయని చెప్పవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. సంక్రాంతి సెలవలు వచ్చేశాయి.. ఎన్ని రోజులంటే
సంక్రాంతికని సొంతూరుకు వచ్చినవారిని.. వెంటాడిన మృత్యువు
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ… కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు! వీడియో వైరల్
