India – Bharat: భారత్‌గా మార్పుపై ఐక్యరాజ్య సమితి ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
జీ20 శిఖరాగ్ర సదస్సును పురస్కరించుకుని విదేశీ నేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ఆహ్వాన పత్రికలపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడంతో రాజకీయ వివాదం రాజుకుంది. ఇండియా పేరును భారత్‌గా మార్చేస్తారంటూ ఎడతెగని చర్చ జరుగుతోంది. తాజాగా, ఈ అంశంపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. పేర్ల మార్పుపై సభ్య దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.
జీ20 శిఖరాగ్ర సదస్సును పురస్కరించుకుని విదేశీ నేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ఆహ్వాన పత్రికలపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడంతో రాజకీయ వివాదం రాజుకుంది. ఇండియా పేరును భారత్‌గా మార్చేస్తారంటూ ఎడతెగని చర్చ జరుగుతోంది. తాజాగా, ఈ అంశంపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. పేర్ల మార్పుపై సభ్య దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ కీలక ప్రకటన చేశారు. గతేడాది టర్కీ తన పేరును తుర్కియేగా మార్చుకున్న అంశాన్ని ఉదహరణగా పేర్కొన్నారు. తుర్కియే విషయంలో ఆ దేశ ప్రభుత్వం పంపిన అధికారిక అభ్యర్థనను స్వీకరించి సానుకూలంగా స్పందించాం.. అలాగే, ఏ దేశమైనా ఇలాంటి అభ్యర్థనలు పంపిస్తే వాటిని మేం పరిగణనలోకి తీసుకుంటామని హక్ స్పష్టం చేశారు.. రాష్ట్రపతి ఆహ్వాన పత్రికల్లో భారత్ అని ముద్రించడం, విదేశీ అతిథులకు పంపిణీ చేయనున్న బుక్‌లెట్‌లపైనా కూడా భారత్ అని పేర్కొనడం.. ప్రధాని నరేంద్ర మోదీని కూడా ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని ప్రస్తావించడం వంటివి చర్యలతో ఇకపై ఇండియా పేరు భారత్‌గా మార్చే దిశగా మోదీ సర్కారు అడుగులు వేస్తోన్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..