UAE Working days : దుబాయ్‌లో ఇక నుంచి పనిదినాలు నాలుగున్నర రోజులే !! వీడియో

|

Dec 19, 2021 | 7:20 PM

యుఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారానికి నాలుగున్నర రోజుల మాత్రమే పనిదినాలుగా ప్రకటించింది. ప్రపంచ మార్కెట్లలో పోటీతత్వాన్ని తట్టుకునే లక్ష్యంతో వారాంతాన్ని శని, ఆదివారాలకు మార్చేసింది.

యుఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారానికి నాలుగున్నర రోజుల మాత్రమే పనిదినాలుగా ప్రకటించింది. ప్రపంచ మార్కెట్లలో పోటీతత్వాన్ని తట్టుకునే లక్ష్యంతో వారాంతాన్ని శని, ఆదివారాలకు మార్చేసింది. ఇక నుంచి మొత్తం నాలుగున్నర రోజులు మాత్రమే పనిదినాలు ఉంటాయని పేర్కొంది. ఈ నిర్ణయం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం యూఏఈలో శుక్రవారం, శనివారం సెలవు దినాలుగా ఉన్నాయి. ఇకపై ఆదివారం కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం సెలవు కావడంతో ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే 2022 జనవరి 1వ తేదీ నుంచి వారాంతపు సెలవులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు మొదలై ఆదివారం ముగిసే వరకు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవస్థను సౌదీకి పోటీగా తీర్చిదిద్దేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: భార్యను ఎత్తుకోబోయి.. వెనక్కిపడిన భర్త !! నవ్వాపుకోలేరు !! వీడియో

Viral Video: సింహం పై దాడికి రెడీ అయిన కుక్క !! చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే !! వీడియో

షాక్‌ కొడుతున్న చాట్‌ !! ప్లేట్ చోలే పూరీ రూ.1000 !!ఎక్కడంటే ?? వీడియో

Viral Video: వేటకు వచ్చిన పిల్లికి !! చుక్కలు చూపించిన కోడిపుంజు !! వీడియో

Viral Video: పచ్చి మిర్చితో ఇలా కూడా చేయచ్చ నాయనా !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో