ఒకేరోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు !!
ప్రమాదాల్లో విమానాలు రైళ్లతో పోటీపడుతున్నాయా అనిపిస్తోంది. ఇటీవల తరచూ ఎక్కడో అక్కడ విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఒకే ఎయిర్‌పోర్ట్‌లో, ఓకే రోజు రెండు విమాన ప్రమాదాలు చోటుచేసుకున్న ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. టాంజానియా దేశంలో ఒకే రోజు, ఒకే ఎయిర్ పోర్టులో రెండు విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. విమానాలు ల్యాండ్ అయ్యే సమయంలో గంటల వ్యవధిలోనే ఈ రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
ప్రమాదాల్లో విమానాలు రైళ్లతో పోటీపడుతున్నాయా అనిపిస్తోంది. ఇటీవల తరచూ ఎక్కడో అక్కడ విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఒకే ఎయిర్‌పోర్ట్‌లో, ఓకే రోజు రెండు విమాన ప్రమాదాలు చోటుచేసుకున్న ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. టాంజానియా దేశంలో ఒకే రోజు, ఒకే ఎయిర్ పోర్టులో రెండు విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. విమానాలు ల్యాండ్ అయ్యే సమయంలో గంటల వ్యవధిలోనే ఈ రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెండు విమానాల్లోనూ ముగ్గురు సిబ్బందితోపాటు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదాల్లో విమానాలు బాగా దెబ్బతిన్నప్పటికీ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని, వారికి ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు పేర్కొన్నారు. టాంజానియాలోని కికోబోగా ఎయిర్ పోర్టులో నవంబరు 28న ఈ ప్రమాదాలు జరిగాయి. జాంజిబార్ ఎయిర్ పోర్టు నుంచి 30 మంది ప్యాసింజర్లు, ముగ్గురు సిబ్బందితో యునైటెడ్ ఎయిర్ జాంజిబార్ విమానం కికోబోగాకు బయలుదేరింది. కికోబోగా విమానాశ్రయంలో దిగుతుండగా ఫ్లైట్ రన్ వేను తాకగానే ల్యాండింగ్ గేర్ ఊడిపోయింది. దీంతో విమానం రన్ వే పై కొద్దిదూరం ఈడ్చుకుంటూ వెళ్లింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట
బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్ చెరలో 10 నెలల చిన్నారి మృతి
ఆక్సిజన్ సిలిండర్‌తో పోలింగ్ కేంద్రానికి.. అందరికీ వీళ్లు ఆదర్శం
మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ బూత్‌లు.. సమీపంలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు