Spanish town: దాదాపు 60 ఏళ్లుగా ఖాళీగా ఉంటున్న ఊరు.. కారణం తెలిస్తే షాకవుతారు.!(వీడియో)
దాదాపు అరవయ్యేళ్లుగా ఆ ఊరు ఖాళీగానే ఉంటోంది. చిట్టచివరి మనిషి ఈ ఊరిని ఖాళీచేసి వెళ్లిపోయిన నాటి నుంచి ఇక్కడ పిట్టమనిషి కూడా ఉండటం లేదు. స్పెయిన్‌లోని స్వయంపాలిన ప్రాంతమైన ఎస్ట్రెమాడురాలో
దాదాపు అరవయ్యేళ్లుగా ఆ ఊరు ఖాళీగానే ఉంటోంది. చిట్టచివరి మనిషి ఈ ఊరిని ఖాళీచేసి వెళ్లిపోయిన నాటి నుంచి ఇక్కడ పిట్టమనిషి కూడా ఉండటం లేదు. స్పెయిన్‌లోని స్వయంపాలిన ప్రాంతమైన ఎస్ట్రెమాడురాలో ఉన్న ఈ ఊరి పేరు గ్రానడిల్లా. ప్రపంచం నలుమూలలా రకరకాల కారణాల వల్ల ఊళ్లు ఖాళీ అవుతుంటాయి. కానీ, గ్రానడిల్లా ఖాళీగా పడి ఉండటానికి కారణం మాత్రం విచారకరమనే చెప్పుకోవాలి. ఈ చిన్న పట్టణాన్ని తొమ్మిదో శతాబ్దిలో అప్పటి ముస్లింపాలకులు నిర్మించారు. ఈ ఊళ్లోని జనాలు ప్రధానంగా ఊరిబయటి భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ బతికేవాళ్లు. స్పెయిన్ నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో 1950లో ఈ ఊరి సమీపంలోని నది మీద రిజర్వాయర్ నిర్మించనున్నట్లు ప్రకటించాడు. రిజర్వాయర్ పనులు కొనసాగుతుండగా, 1960 ప్రాంతంలో ఊరు మునిగిపోవచ్చని అప్పటి అధికారులు అంచనా వేశారు. దాంతో ఊళ్లోని జనాలు భయపడి పట్టణాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. అటు రిజర్వాయర్ కోసం ఊరికి వచ్చే దారులన్నింటినీ మూసివేశారు. దాంతో ఈ ఊరు బాహ్యప్రపంచంలో సంబంధాలు కోల్పోయి ఒక ద్వీపంలా మారింది. చివరికి రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినా, ఊరు మునిగిపోలేదు. కాగా, ఆ ఊరికి వెళ్లేందుకు రోడ్డు మార్గం లేక.. తిరిగి సొంతూరు రాలేక ఆ ఊరి జనం ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

