Watch Video: చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..
ఓటు హక్కును వినియోగించుకున్న దివ్యాంగ ఓటరు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండు చేతులు లేకపోయినా ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న గొప్పతనాన్ని చాటిచెప్పాడు. ఆసిఫాబాద్ జిల్లాలో, సిర్పూర్‌కాగజ్‌నగర్‌కు చెందిన ఈ యువకుడికి రెండు చేతులు లేవు. నడిచేందుకు, రాసేందుకు కాళ్లనే ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఎన్నికల సందర్భంగా చేతులు లేని ఈ యువకుడు తన కాలితో ఈవీఎం బటన్ నొక్కి ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
ఓటు హక్కును వినియోగించుకున్న దివ్యాంగ ఓటరు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండు చేతులు లేకపోయినా ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న గొప్పతనాన్ని చాటిచెప్పాడు. ఆసిఫాబాద్ జిల్లాలో, సిర్పూర్‌కాగజ్‌నగర్‌కు చెందిన ఈ యువకుడికి రెండు చేతులు లేవు. నడిచేందుకు, రాసేందుకు కాళ్లనే ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఎన్నికల సందర్భంగా చేతులు లేని ఈ యువకుడు తన కాలితో ఈవీఎం బటన్ నొక్కి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. దీనికంటే ముందు చేతులు లేవని ఇంట్లోనే కూర్చోకుండా ఉన్నంతలో పోరాడాలని తనకు రాజ్యంగం ఐదేళ్లకు ఒక్కసారి కల్పించిన హక్కును వినియోగించుకోవాలని దృఢంగా సంకల్పించాడు. దీంతో పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన కాలి బొటన వేలికి గర్వంగా సిరా వేసుకున్నాడు. ఓటు వేసేందుకు సంబంధించిన పూర్తి ప్రక్రియను ఎన్నికల అధికారులు చెప్పిన విధంగా కాళ్ల వేలితో పూర్తి చేశాడు. ఆ తరువాత తమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రజాప్రతినిధులలో తనకు మంచి చేసిన వారిని ఎంచుకున్నాడు. చేతులు లేవని చలికలపడిపోకుండా ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచాడు. అన్నీ ఉన్నా ఓటు వేసేందుకు ఆసక్తి చూపని వారికి కనువిప్పు చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఏపీ, తెలంగాణ ఎన్నికల ఓటింగ్ లైవ్ అప్డేడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…