Afghan woman beaten: మితిమీరిన తాలిబన్ల ఆగడాలు.. మహిళను తీవ్రంగా తాలిబన్ అరాచకం..!(వీడియో)
అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు మహిళల విషయంలో మాట తప్పారు. భయంతో చాలా మంది మహిళలు ఉద్యోగాలకు వెళ్లడంలేదు. దీంతో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో తాలిబన్లపై ఎదురుతిరగాలని కంకణం కట్టారు. తమ స్వేచ్ఛకు భంగం కలిగించరాదంటూ మహిళలు....
అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు మహిళల విషయంలో మాట తప్పారు. భయంతో చాలా మంది మహిళలు ఉద్యోగాలకు వెళ్లడంలేదు. దీంతో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో తాలిబన్లపై ఎదురుతిరగాలని కంకణం కట్టారు. తమ స్వేచ్ఛకు భంగం కలిగించరాదంటూ మహిళలు రోడ్లపైకి చేరి గొంతెత్తి నినదిస్తున్నారు. ప్లకార్డులు చేతపట్టి ర్యాలీలుగా వెళుతున్నారు.
విద్య, ఉద్యోగ రంగాల్లో హక్కులతో పాటు కొత్తగా కొలువుదీరబోయే తాలిబన్ల ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలంటూ అఫ్గాన్ మహిళలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ స్వేచ్ఛ, హక్కులను కాలరాయకండి అంటూ కాబుల్‌లో రెండో రోజు నిరసన కొనసాగించగా .. ఉద్రిక్తంగా మారింది. మహిళలంతా ప్రదర్శనగా ప్రెసిడెన్షియల్ భవనం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. తాలిబన్ ఫైటర్లు వారిని అడ్డుకున్నారు. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. ఓ మహిళ తలకు గాయమై నెత్తురు కారింది. ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాబుల్‌తో పాటు హెరాత్‌లో మహిళలు గళం విప్పారు. వీళ్ళపైన తాలిబన్లు తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు. హెరాత్‌లో నిరసనకారుల వద్ద నుంచి కరపత్రాలను లాక్కొని చింపేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. తాలిబన్ల ప్రభుత్వంలో మహిళలకు చోటు దక్కకపోవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ నిరసనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అఫ్గాన్ మహిళలకు ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించినప్పటికీ.. వారికి కేబినెట్‌లో గానీ, ప్రభుత్వంలో, ఏ ఇతర ఉన్నత పదవుల్లో గానీ స్థానం కల్పించే అవకాశం లేదంటూ తాలిబన్ల సీనియర్ నేత మహమ్మద్ అబ్బాస్ ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Nipah Virus Video: శరవేగంగా నిఫా.. కేరళలో నిఫా వైరస్ కలకలం.. 12 ఏళ్ల బాలుడు మృతి!(వీడియో)
ఆ స్టార్ హీరోకు నో చెప్పిన తమన్..! అసలు మేటర్ ఏంటంటే(వీడియో): Music Director Thaman Video.