వాకింగ్ కు వెళ్లిన గర్భిణి.. మృత్యు రూపంలో దూసుకొచ్చిన కారు..
సిడ్నీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 నెలల గర్భిణి అయిన భారతీయ మహిళ సమన్విత, ఆమె కడుపులోని బిడ్డ మృతి చెందారు. జీబ్రా క్రాసింగ్ దాటుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. మరో నెలలో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. భర్త శోకసంద్రంలో మునిగిపోయారు. 19 ఏళ్ల కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
ఆమె ఎనిమిది నెలల గర్భిణి. నెల రోజుల్లో ఆమె చేతిలో పండంటి బిడ్డ ఉంటుంది అనుకున్నారు. అంతలోనే దారుణం జరిగింది. పుట్టబోయే బిడ్డ కోసం ఆమె ఆత్రుతగా ఎదురు చూస్తు.. చిన్నారి రాక కోసం సంతోషంగా రోజులు లెక్కబెట్టుకుంటున్న వేళ విధి ఆమె తలరాత మార్చింది. ఇక నెల రోజుల్లో వారింట చిన్నారి కేరింతలు వినిపిస్తాయని భావిస్తే.. ఊహించని రీతిలో మృత్యు ఘంటికలు మోగాయి. మరో నెల రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన మహిళ.. కడుపులో బిడ్డతో సహా కన్నుమూసింది. రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో భారతదేశానికి చెందిన ఓ గర్భిణి రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నెల రోజుల్లో బిడ్డకు జన్మనివ్వాల్సిన మహిళ.. ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆమె భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భారత్‌కు చెందిన 33 ఏళ్ల సమన్విత సిడ్నీలోని హార్న్స్‌బై ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆమెకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండో సారి గర్భం దాల్చిన ఆమె ఇప్పుడు 8 నెలల గర్భిణి. మరో నెలలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. వీకెండ్ రోజున సమన్విత తన భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి ఇంటి దగ్గర ఉన్న పార్క్ వద్దకు వాకింగ్‌కు వెళ్లారు. సమన్విత జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతున్నారు. వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో సమన్విత తీవ్రంగా గాయపడ్డారు. సమన్విత భర్త ఆమెను ఆస్పతికి తీసుకెళ్ళారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె గర్భంలో ఉన్న శిశువు కూడా లోకం చూడకముందే.. తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పియిందని చెప్పారు. మరికొన్ని వారాల్లో పండంటి బిడ్డతో సందడిగా ఉండాల్సిన తమ ఇల్లు.. భార్య, ఆమె కడుపులోని బిడ్డ మృతితో విషాదంగా మారిందని సమన్విత భర్త కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని 19 ఏళ్ల ఆరోన్‌గా గుర్తించారు. సమన్విత స్థానికంగా ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో టెస్ట్ అనలిస్ట్‌గా పనిచేస్తుండేవారని పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anchor Suma: రిటైర్మెంట్ పై సుమ షాకింగ్ కామెంట్స్.. ఆ వర్గానికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా
నవంబర్ మొత్తం.. చల్ల చల్లని కూల్‌కూల్
Sabarimala: భక్తుల రద్దీతో ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం
Cyclone Alert: దూసుకొస్తున్న మరో తుఫాన్ వాతావరణశాఖ పిడుగులాంటి వార్త
శివయ్య కోసం వందల సంఖ్యలో తరలి వచ్చిన పాములు.. హర హర మహాదేవ..
