ఎటు చూసినా నీళ్లే.. శ్రీలంకను ముంచిన వరుణుడు
శ్రీలంకను భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు అతలాకుతలం చేశాయి. 56 మందికి పైగా మరణించగా, 14 మంది గల్లంతయ్యారు. ఇళ్లు, పొలాలు, రోడ్లు నీటమునిగి, రైల్వే వ్యవస్థ దెబ్బతింది. సుమారు 4,000 కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బదుల్లా, నువారా ఎలియా ప్రాంతాల్లో నష్టం అధికం. 2003 నాటి విపత్తు జ్ఞాపకాలు భయాన్ని పెంచుతున్నాయి.
భారీవర్షాలతో శ్రీలంక అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదలు ముంచెత్తడంతో సుమారు 56కి పైగా మంది చనిపోయారు. వారాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఇండ్లు, పొలాలు, రహదారులను వరదలు ముంచెత్తాయి. పర్వతప్రాంతాల్లో రాళ్లు, బురద, చెట్లు పట్టాలపై పడటంతో రైల్వే వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. పలు ప్రాంతాల్లో ప్యాసింజర్ రైళ్లను నిలిపివేశామని అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లను కూడా మూసివేశామని ప్రకటించారు. వర్షాలు, ప్రతికూల వాతావరణంతో సుమారు 4,000 కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకటించింది. కొలంబోకు తూర్పున 300 కి.మీ దూరంలో ఉన్న మధ్యప్రావిన్స్‌లోని పర్వతప్రాంతాలైన బదుల్లా, నువారా ఎలియాలో అత్యధిక మరణాలు సంభవించాయి. ఇవే ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో మరో 14మందికి పైగా గల్లంతైనట్టు అయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. 2003 జూన్‌లో వచ్చిన వరదలకు 250కిపైగా శ్రీలంకవాసులు చనిపోగా.. వందతల మంది గల్లంతు అయ్యారు.. ఇప్పుడు మరోసారి వర్షాలు బీభత్సం సృష్టించడంతో అక్కడి వారు ఆందోళన మొదలైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం
Hongkong: అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు పన్నెండు మంది మృతి.. లోపలే చిక్కుకున్న వందలాది మంది
చెవిపోగులు తాకట్టు పెట్టింది.. కట్ చేస్తే కటిక పేదరికం నుండి పెద్ద ధనవంతురాలు అయ్యింది
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

