ఒక్క మలుపు కూడా లేకుండా 256 కి.మీ హైవే
రోడ్డు జర్నీ చేసే వాళ్లకు ఓ ఆలోచన వస్తుంటుంది. రోడ్డు ఎక్కువ దూరం స్ట్రైట్‌గా ఉంటే బాగుంటుందని అనుకుంటారు. టర్న్ అవ్వడానికి స్లో కాకుండా ఫాస్ట్‌గా, డైరెక్ట్‌గా వెళ్లిపోవచ్చని ఆలోచిస్తారు. కానీ అలాంటివేం కుదరవు, ఎక్కడో ఒకచోట మలుపు వస్తుంది. ఏ దేశంలోనైనా రోడ్లు ఇలానే ఉంటాయనుకుంటే పొరపాటే. ఒక్క మలుపు కూడా లేని రోడ్డు ఒకటి ఉంది.
ఇది 256 కిలోమీటర్లు స్ట్రైట్‌గా ఉంటుంది. అదే సౌదీ అరేబియాలోని హైవే 10. ప్రపంచంలో ఒక్క మలుపు కూడా లేని పొడవైన రోడ్డుగా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా ఐర్ హైవే (Eyre highway) పేరుతో ఉండగా, తాజాగా హైవే 10 దాన్ని బ్రేక్ చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద ఇసుక ఎడారి, రబ్ అల్ ఖలీ మీదుగా నిర్మించిన హైవే 10 లో ఏకంగా 256 కిలోమీటర్ల దూరం వరకు ఒక్క మలుపు కూడా లేదట! చమురు, గ్యాస్ నిల్వల నగరమైన హరద్ నుంచి పొరుగునున్న యూఏఈ సరిహద్దు ప్రాంతం అల్ బతా వరకు ఉన్న ఈ హైవే పూర్తిగా నిటారుగానే ఉంటుంది. దేశ రాజు అబ్దుల్లా కోసం ముందుగా దీన్ని ప్రైవేటు రోడ్డుగా ఇలా ప్రత్యేకంగా నిర్మించారట. అయితే ప్రస్తుతం చమురు రవాణాకు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ హైవే నిటారుగా ఉండటమే కాదు.. మొత్తం 256 కి.మీ. మార్గంలో ఎత్తుపల్లాలు కూడా ఉండవని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తెలిపింది. అలాగే ఈ దారిలో ఎక్కడా ఒక్క చెట్టు లేదా కట్టడం కూడా కనిపించదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ మిక్సీ మొరాయిస్తోందా.. ఇలా చేయండి.. దారికొస్తుంది
ఉరుములకు భయపడిన ఉడుత..ఏం చేసిందంటే
రాత్రిపూట స్నానం చేస్తున్నారా.. ఏమవుతుందో తెలుసా ??
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

