సింహాల గుంపులోకి ఏనుగు ఎంట్రీ.. చివరిలో సూపర్ ట్విస్ట్
సింహం గర్జించిందంటే కలుగులో ఉన్న ఎలుక కూడా గడగడా వణకాల్సిందే. అడవికి రాజైన సింహం అంటే ఎంతటి భారీ జంతువుకైనా భయమే. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఓ సింహాల గుంపునే పరుగులు పెట్టించింది ఓ ఏనుగు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు.
నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయ్… సింహం.. సింగిల్‌గా వస్తుంది అనేది ఓ సినిమాలో డైలాగ్. నిజంగానే సింహం అంత పవర్‌ఫుల్. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయిపోయింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొన్ని సింహాలు ఓ చోట గుంపుగా చేరి సేదతీరుతుంటాయి. అదే సమయంలో ఓ పెద్ద ఏనుగు ఘీంకరిస్తూ అక్కడికి వచ్చింది. ఏనుగు ఘీంకారానికి దెబ్బకు భయపడిన సింహాలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాయి. ఓర్నాయనో.. ఇక్కడే ఉన్నామంటే ఈ ఏనుగు తొక్కి పడేసేలా ఉంది… అనుకొని అక్కడినుంచి సింహాలన్నీ తలోదిక్కూ పరుగు తీశాయి. అలా పారిపోతున్న సింహాలను చూసిన ఏనుగు వాటిని మరింత భయపెడుతూ వాటి వెంటపడటంతో బ్రతుకు జీవుడా అంటూ సింహాలు పారిపోయాయి. ఈ ఘటనను సఫారీకి వెళ్లిన కొందరు పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో పాతదే అయినా మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఈ ఏనుగు పవర్ మామూలుగా లేదుగా అని కొందరు.. అడవిని గడగడలాడించే సింహాలకే చుక్కలు చూపించిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 26 లక్షల మందికి పైగా వీక్షించారు. 20 వేలమందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ డైట్ ఫాలో అయితే.. మీ కిడ్నీలకు ఢోకా ఉండదు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

