స్కూటరిస్ట్ పై ఏనుగు దా*డి.. తృటిలో తప్పుకోవడం చూస్తే గుండె గుభేల్
‘‘ఒక్కసారి కమిట్ అయితే.. నా మాట నేనే వినను’’.. అనే సినిమా డైలాగ్ ఏనుగులకు సరిగ్గా సరిపోతుంది. ఒక్కసారి తిక్కరేగితే వాటి మాట అవే వినవు మరి. అప్పటిదాకా శాంతంగా కనిపించే ఏనుగులు.. ఉన్నట్టుండి అందరికీ షాక్ ఇస్తుంటాయి. చెట్టూ.. పుట్టా.. ఇల్లూ.. వాహనాలూ.. ఇలా దేన్నీ వదలకుండా సర్వనాశనం చేస్తుంటాయి.
మరికొన్నిసార్లు రోడ్డుపై వాహనదారులను బెదిరించి మరీ ఆహార పదార్థాలను లాక్కుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, కెనడాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ ఉత్తర్‌ప్రదేశ్‌లో తనకెదురైన అనుభవాన్ని నెట్టింట పోస్ట్ చేయగా ఆ వీడియో చక్కర్లు కొడుతోంది. ఓ ఏనుగు రోడ్డు మధ్యలో నిలబడి ఉంది. అదే సమయంలో ఆ వ్లాగర్ ఏనుగును దాటుకుంటూ వెళ్లాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి. అంతలో వెనకే మరో స్కూటర్‌పై వచ్చిన ట్రావెల్ వ్లాగర్ ఫ్రెండ్ .. ఏనుగును చూసి దూరంగా బండిని ఆపాడు. అతన్ని గమనించిన ఏనుగు.. పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే వెంటనే అప్రమత్తమైన అతను.. స్కూటర్‌ని వేగంగా నడుపుతూ రోడ్డు పక్కగా వెళ్లి తప్పించుకుంటాడు. అయితే ఆ తర్వాత ఏనుగు అక్కడే నిలబడిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. “ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఊహించలేమని బహుశా‘‘టోల్ వసూలు చేయడానికి వచ్చి ఉంటుంది అని కొందరు, ‘‘అతడి అదృష్టం బాగుంది.. ఎంతో లక్కీగా తప్పించుకున్నాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. వీడియో ప్రస్తుతం 44 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒత్తిడి తగ్గించే అద్భుత రహస్యం..
ఉరుములకు భయపడిన ఉడుత..ఏం చేసిందంటే
మీ మిక్సీ మొరాయిస్తోందా.. ఇలా చేయండి.. దారికొస్తుంది

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
