ఒత్తిడి తగ్గించే అద్భుత రహస్యం..
మీలో మానసిక ఒత్తిడిని తగ్గించే అద్భుతమైన రహస్యం ఒకటుంది. అదేంటంటే.. కుటుంబంతో కలిసి భోం చేయడమేనని అంటున్నారు నిపుణులు. ఫ్యామిలీ మొత్తం తరచుగా కలిసి డిన్నర్ చేస్తుండటం వల్ల తక్కువ మానసిక ఒత్తిడిని అనుభవిన్నట్లు,ఎక్కువ సంతోషంగా ఉంటున్నట్లు తెలిసింది. బహుశా ఫిన్లాండ్ అనే చిన్న దేశం గురించి మిగిలిన సందర్భాల్లో ఎవరూ ఎక్కువ ముచ్చటించకపోవచ్చు..
కానీ యేటా కచ్చితంగా ఆ దేశం టాక్ ఆఫ్ ది వరల్డ్ అవుతుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా హ్యాపీనెస్ ఇండెక్స్‌లో తొలిస్థానంలో ఫిన్లాండ్ నిలుస్తోంది కాబట్టి. world happiness report 2025లో కూడా ఫిన్‌లాండ్ వరుసగా ఏడో సంవత్సరం హ్యపియెస్ట్ దేశాల్లో టాప్ లో నిలిచింది. భారత్ స్థానం 118గా ఉంది. ఫిన్లాండ్‌లో సంతోషానికి కారణం అక్కడి ప్రజలు తమ కుటుంబంతో కలిసి డిన్నర్ చేయడమే అన్నారు. ఆ సమయం హ్యాపీనెస్‌ను పెంచే డిన్నర్ థెరపీగా పనిచేస్తుందని నమ్ముతున్నారు. అయితే వివిధ కారణాలు, బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పటికీ చాలా మంది ఒంటరిగానే భోజనం చేయాల్సి వస్తోంది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ముగ్గురిలో ఇద్దరు ప్రతీరోజు ఏదో ఒక కారణంతో సాధారణ ఒత్తిడికి లోనవుతున్నారు. ఇక 27 శాతం మంది ఎక్కువ స్ట్రెస్‌కు గురవుతున్నారు. క్రానిక్ స్ట్రెస్‌వల్ల ప్రజల్లో గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటంబంతో కలిసి తినడం అనేది ‘డిన్నర్ థెరపీ’గా పనిచేస్తోంది. ఆరోగ్య ప్రమాదాలను నివారిస్తోందని పరిశోధకులు చెప్తున్నారు. కలిసి భోజనం చేయడం అనేది ఒత్తిడిని తగ్గించడానికి, ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి, సామాజిక సంబంధాలను మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఇదొక గొప్ప మార్గం అని నిపుణులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉరుములకు భయపడిన ఉడుత..ఏం చేసిందంటే
మీ మిక్సీ మొరాయిస్తోందా.. ఇలా చేయండి.. దారికొస్తుంది
ఉరుములకు భయపడిన ఉడుత..ఏం చేసిందంటే
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

