Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అర్థరాత్రి దొంగతనానికి వచ్చాడు.. తాళం తెరుచుకోకపోవడంతో ఇలా.. కట్ చేస్తే..

Telangana: అర్థరాత్రి దొంగతనానికి వచ్చాడు.. తాళం తెరుచుకోకపోవడంతో ఇలా.. కట్ చేస్తే..

Ram Naramaneni

|

Updated on: May 14, 2025 | 8:20 AM

సింగిల్‌గా ఉన్న ఇంటిని టార్గెట్ చేశాడు దొంగ. తొలుత  తాళం పగలకపోవడంతో సిగరెట్ దమ్ము తాగి.. బాగా ఎనర్జీ తెచ్చుకుని.. తాళం పగలగొట్టాడు. లోపల బీరువాలో ఉన్న 3 తులాల బంగారం, 10 తులాల వెండి, 42,000 వేలు నగదు ఎత్తుకెళ్లాడు. 

సిగిరెట్లు తాగే అలావాటు ఉన్నవారు.. దమ్ము వేయకుంటే మాకు దిమాక్ సరిగ్గా పని చెయ్యదు అని చెబుతుండటం మనం వింటూ ఉంటాం.  అంతెందుకు కొంతమంది కవులు, రచయితలు, కళాకారులు వంటి వాళ్లు సైతం ఇదే మాట చెప్పిన దాఖలాలు ఉన్నాయి. నాలుగు దమ్ములు గుంజితే, దుమ్మురేపే ఆలోచనలు వస్తాయని చెబుతుంటారు.. అటాంటి క్రియేటివ్ పర్సన్స్‌కు మాత్రమే కాదు. కొంతమంది ప్రొఫెషనల్ దొంగలకు కూడా సిగరెట్ ఓ వీక్‌నెస్ అనుకుంట.

ఎండకాలం సెలవులు వస్తే జనాలు ఊర్లు, టూర్లకు పోతూ ఉంటారు. దీంతో దొంగలకు చేతి నిండా పని ఉండే సీజన్ ఇది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బస్తీలో సింగిల్‌గా విసిరేసినట్లు ఉండే ఇల్లును టార్గెట్ చేశాడు దొంగ. అందునా తాళం వేసి ఉండటంతో.. తన పని సులువు అనుకున్నాడు.. పగటిపూట రెక్కీ చేసి పోయినట్లున్నాడు.. రాత్రి ఒంటిగంట కొట్టే సమయంలో గోడ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించాడు.. మెష్ డోర్ తెర్సి.. తాళం ఇరగొడ్దామని ట్రై చేశాడు.

కానీ ఎంత ట్రై చేసినా వర్కవుట్ అవ్వలే.. కానీ టైమైపోతుంది.. ఇది అయ్యేలా లేదు కానీ.. ఓ దమ్ము కొట్టి  తన దమ్ము ఏంటే చూపిద్దాం అనుకున్నట్లు ఉన్నాడు.. అక్కడే మెట్ల మీద తిష్ట వేసి.. సిగిరెట్ వెలిగించాడు. ఏక్ ధమ్ నాలుగు దమ్ములు గుంజినాక లేచి, రాడ్‌తో ఠక్కున తాళాన్ని విరగొట్టాడు. రెండు పెగ్గులు తాగినాక మందుబాబులు రీచార్జ్ అయినట్టు.. సిగిరెట్ దమ్ము కొట్టగానే బ్రెయిన్, బాడీ రెండూ రీచార్జ్ అయినట్లున్నాయ్ ఈ దొంగకి. తాళం ఓపెన్ అవ్వగానే లోపట బీరువా వద్దకు వెళ్లి..లోపటున్న సొమ్ము అంతా సంచిలో వేసుకుని వెళ్లిపోయాడు. ఇంటి వాచ్‌మెను కూడా తిరుపతి వెంకన్న దర్శనానికి తీసుకుపోయానని.. తాను ఇలా జరుగుతుందని ఊహించలేదంటున్నాడు బాధితుడు శ్రీనివాస్.  3 తులాల బంగారం, 10 తులాల వెండి, 42 వేల నగదు దొంగ అపహరించుకుపోయాడని వాపోతున్నాడు.

మే 10న తిరుమల పోయారట కుటుంబ సభ్యులు. 12న రిటన్ వచ్చేటప్పుడు ఇంటి సీసీ విజువల్స్ చెక్ చేయడంతో.. ముందు డోర్ ఓపెన్ చేసి ఉందట. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించినట్లు ఇంటి ఓనర్ శ్రీనివాస్ తెలిపాడు. తిరుమలలో నిలువు దోపిడి ఇవ్వడం ఏమో కానీ.. అక్కడికి వెళ్లి వచ్చేసిరికి ఇళ్లంతా దోపిడికి గురైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: May 14, 2025 08:16 AM