క్యాన్సర్‌కు చెక్ పెట్టే రష్యన్ టీకా వీడియో
వైద్య ప్రపంచంలో రష్యా ఒక అద్భుత సంచలనానికి తెరలేపింది. క్యాన్సర్ వ్యాధికి చికిత్సగా ఎంటెరోమిక్స్ పేరుతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగశాల స్థాయిలో పరీక్షించినప్పుడు ఇది 100 శాతం ప్రభావవంతంగా పనిచేసినట్లు తెలిసింది. ఈ శుభవార్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. గతంలో స్పుత్నిక్ కోవిడ్ వ్యాక్సిన్‌ను రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మాస్కోలోని ప్రముఖ సెంటర్ లోనే ఈ ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేశారు. ఇది ఒక రకమైన ఎంఆర్ఎన్ఏ ఆధారిత చికిత్సా విధానం.
ఈ వ్యాక్సిన్‌ను ఒక్కో రోగికి వారి కణితి కణాల జన్యువుల ఆధారంగా ప్రత్యేకంగా తయారుచేస్తారు. దీని ద్వారా వ్యాక్సిన్ నేరుగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లోకి ప్రవేశించింది. ఈ ట్రయల్స్ విజయవంతమైతే ఇది క్యాన్సర్ చికిత్సారంగంలో ఒక నూతన అధ్యయాన్ని ప్రారంభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రాథమిక పరీక్షలో దీని ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో రష్యా ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను తమ పౌరులకు ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు చెందిన మోడర్నా కంపెనీ ఎంఆర్ఎన్ఏ ఆధారిత క్యాన్సర్ థెరపీలను అభివృద్ధి చేస్తోంది. అయితే రష్యా ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ తో ఈ పోటీలో ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది కేవలం ఒక వైద్య ఆవిష్కరణ మాత్రమే కాదని ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపై ఘనమైన ప్రభావాన్ని చూపగల సామర్థ్యం దీనికి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న లక్షలాది మందికి ఈ వ్యాక్సిన్ ఒక కొత్త ఆశను ఇస్తోంది. ఈ క్లినికల్ ట్రయల్స్ విజయం సాధించి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఇది క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయగలదని లేదా కనీసం దానిని దీర్ఘకాలిక వ్యాధిగా మార్చగలదని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అంతరిక్షంలో ఇరుక్కుపోయా.. ఆక్సిజన్‌కి డబ్బులు పంపవా?వీడియో
వారికి జీతం 3 రెట్లు పెంపు.. ఒక్కొక్కరికీ నెలకు రూ.లక్షపైనే వీడియో
ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ పోస్ట్.. డియర్ గౌరీ అంటూ.. వీడియో
పని వాళ్లకి రూ.80 లక్షల ఇల్లు గిఫ్ట్ వీడియో
ఎవరెస్ట్ కరిగిపోతోంది.. కారణం ఇదే!
డీజే సౌండే నా బిడ్డను బలి తీసుకుంది
కంటెంట్ ఉన్నోడికి.. కటౌట్‌తో పనిలేదు డ్యూడ్!
అంత్యక్రియలు చేసిన తర్వాత 15 రోజులకు తిరిగొచ్చిన కొడుకు
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!

