Restrictions on football: చైనా ఓవరాక్షన్.. ఫుట్‌బాల్ ప్రసారాల పైనా ఆంక్షలు..! వీడియో
చైనాలో కరోనా కేసుల నియంత్రణ కోసం ఆ దేశ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖతార్ లో జరుగుతున్న ఫుట్‌బాల్ వల్డ్ కప్ మ్యాచ్‌ల ప్రసారాలపై ఆంక్షలు విధించింది. మ్యాచ్ ప్రసారాల్లో మాస్క్ ధరించని
చైనాలో కరోనా కేసుల నియంత్రణ కోసం ఆ దేశ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖతార్ లో జరుగుతున్న ఫుట్‌బాల్ వల్డ్ కప్ మ్యాచ్‌ల ప్రసారాలపై ఆంక్షలు విధించింది. మ్యాచ్ ప్రసారాల్లో మాస్క్ ధరించని ప్రేక్షకుల ముఖాలను దగ్గరగా చూపించవద్దని ఆ దేశ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలను ఆదేశించింది.ఆదివారం జరిగిన జపాన్-కోస్టారికా మ్యాచ్‌కు సంబంధించి మాస్క్ లేకుండా గ్యాలరీలో కేరింతలు కొడుతున్న ప్రేక్షకుల వీడియోలకు బదులు ఆటగాళ్లు, స్టేడియంలోని అధికారుల ఫొటోలను సీసీటీవీ స్పోర్ట్స్ ప్రసారం చేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. చైనా సోషల్ మీడియా యాప్‌లలో ప్రత్యక్ష ప్రసారమైన మ్యాచ్‌కు, టీవీ ఛానెళ్లలో ప్రసారమైన మ్యాచ్‌కు మధ్య వ్యత్యాసం ఉండంతో పలువురు యూజర్లు సైతం సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.గత నాలుగు రోజులుగా చైనాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కాగా ఆంక్షలతో విసిగిపోయిన ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..