Hair in stomach: అయ్యో వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.! ఆహారం తినలేక ఇబ్బంది.. చూస్తే పొట్టనిండా వెంట్రుకలే..!
చైనాలో ఆహారం తీసుకోలేని స్థితిలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది ఓ బాలిక. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు షాకయ్యారు. పొట్టనిండా వెంట్రకలు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు.
చైనాలో ఆహారం తీసుకోలేని స్థితిలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది ఓ బాలిక. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు షాకయ్యారు. పొట్టనిండా వెంట్రకలు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. సర్జరీ చేసి పొట్ట నుంచి 3 కేజీల బరువైన వెంట్రుకలతో కూడిన బంతిని బయటకు తీశారు. షాన్‌క్సీ ప్రావిన్స్‌కు చెందిన ఓ బాలిక పికా అనే రుగ్మతతో బాధపడుతోంది. ఈ రుగ్మత ఉన్న వారు మట్టి, పేపర్లు వంటివి తింటుంటారు. ఈ బాలిక మాత్రం తన తలపై వెంట్రుకలను తానే తినడం అలవాటుగా మార్చుకుంది. పొట్టలో తినడానికి మరేమాత్రం చోటు లేనంతలా ఆమె తన వెంట్రుకలను తానే ఆరగించింది.ఆస్పత్రిలో చేరే సమయానికి బోడి గుండుతో ఉన్న ఆ బాలికను పరీక్షించిన వైద్యులు.. పొట్ట నిండా వెంట్రుకలు ఉండడాన్ని గుర్తించారు. సుమారు రెండున్నర గంటల పాటు శస్త్ర చికిత్సచేసి ఆమె పొట్టలోంచి వెంట్రుకలను వెలికితీశారు. బాలిక తల్లిదండ్రులు దూరంగా ఉండడంతో తాతయ్య, నానమ్మ దగ్గరే పెరుగుతోంది. పరిస్థితి విషమించేవరకు వారూ ఈ విషయాన్ని గుర్తించలేదు. కొన్నేళ్లుగా ఆ చిన్నారి ఈ రుగ్మతతో బాధపడుతోంది. 2017లో ఓ బాలుడు జుట్టు కారణంగా పొట్టలో ఇన్‌ఫెక్షన్‌తో మరణించాడు. కాబట్టి ఇలాంటి రుగ్మతలు ఉన్న పిల్లలను తల్లిదండ్రులే దగ్గరుండి చూసుకోవాలని బాలికకు ఆపరేషన్ చేసిన వైద్యుడు సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..

