హనీ ట్రాప్‌లో పాక్‌ హైకమిషనర్‌… అశ్లీల వీడియోలు లీక్‌

Updated on: May 16, 2025 | 5:30 PM

భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ మరో వార్త బయటికొచ్చింది. పాకిస్తాన్‌ హైకమిషనర్‌ హనీట్రాప్‌ లో చిక్కుకున్నట్టు తెలిసింది. ఓ యువతి వలలో పడ్డారు. బంగ్లాదేశ్‌కు హైకమిషనర్‌గా ఉన్న సయ్యద్‌ అహ్మద్‌ మరూఫ్‌ ఓ బంగ్లాదేశీ అమ్మాయితో తిరుగుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. అంతేకాదు వారి అశ్లీల వీడియోలు, ఫొటోలు సైతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

దీంతో అలర్టయిన పాక్‌ విదేశాంగశాఖ ఆ అధికారిని సెలవుపై పంపించేసింది. సయ్యద్‌ అహ్మద్‌ మరూఫ్‌ పాకిస్తాన్‌ తరఫున బంగ్లాదేశ్‌కు హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. bkpఇటీవల మరూఫ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఓ బంగ్లాదేశీ యువతితో ఆయన సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఆమెతో పాక్‌ దౌత్యవేత్తకు సన్నిహిత సంబంధం ఉందని తెలుస్తోంది. ఆయన వలపు వలలో చిక్కుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్‌ ఆ యువతితో పంచుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరూఫ్‌ డిసెంబర్ 2023లో బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ హైకమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మరూఫ్‌ హనీ ట్రాప్‌లో పడ్డారని తెలిసి పాక్‌ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపించేసింది. మరూఫ్ మే 11న ఢాకా నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్‌కు విమానంలో వెళ్లారని బంగ్లాదేశ్ దినపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. హనీట్రాప్ కారణంగా అతడు బంగ్లాదేశ్‌ వీడినట్టు చెప్పుకొచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెరువులో ఈతకు దిగి ఐదుగురు మృతి

బరువు తగ్గాలనుకునే వారికి బఠానీలు బెస్ట్‌ చాయిస్‌

పల్లీలు నువ్వులు కలిపి తింటే ఎన్ని లాభాలో ??

పచ్చి మామిడికి ఫుల్‌ డిమాండ్‌.. కారణం అదేనా ??

ఈ లక్షణాలు మీలో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Published on: May 16, 2025 05:26 PM