17 మంది నవజాత శిశువులకు ‘సిందూర్’ పేరు వీడియో
ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో ఆపరేషన్ సింధూర్ బలంగా కనిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లో 17 మంది ఆడ శిశువులకు వారి కుటుంబ సభ్యులు సింధూర్ అని నామకరణం చేశారు. ఆపరేషన్ సింధూర్ తమ జీవితంలో ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుందో చాటారు. సింధూర్ అనేది ఇప్పుడు కేవలం ఒక పేరు కాదని ఒక భావోద్వేగానికి దేశం పట్ల గౌరవానికి ప్రతీక అని కుషీనగర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ కె షాహి తెలిపారు. బెడిహరి గ్రామానికి చెందిన అర్చన షాహి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల ఆడ శిశువుకు ఆమె జన్మనిచ్చింది. పాపకు సింధూర్ పేరు పెట్టాలని ముందే నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
పెహల్గాం ముగ్ర దాడిలో పలువురు మహిళలు తమ భర్తలను పోగొట్టుకొని పసుపు కుంకుమలను కోల్పోయారని ఆపరేషన్ సింధూర్ అందరినీ గర్వంగా తలెత్తుకునేలా చేసిందని చెప్పారు. ఆ కారణంగానే తమ ఆడబిడ్డకు సింధూర్ పేరు పెట్టుకున్నామని అన్నారు. కాగా సింధూర్ పేరు తమకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని ఆమె భర్త అజిత్ షాహి తెలిపారు. షడ్రౌనా ఏరియాలోని మదన్ గుప్తా కుటుంబ సభ్యులు కూడా ఇదే సెంటిమెంట్‌ను వ్యక్తం చేశారు. గుప్తా కోడలు కాజల్ గుప్తా కొత్తగా పుట్టిన తన ఆడ శిశువుకు సింధూర్ పేరు పెట్టుకుంది. పెహల్గాం ముగ్ర దాడికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటి నుంచి తనకు పుట్టబోయే శిశువుకు సింధూర్ పేరు పెట్టాలని తన కోడలు నిర్ణయం తీసుకున్నట్లు మదన్ గుప్తా అన్నారు. ఈ పేరుతో ఆపరేషన్ సింధూర్ ఎప్పటికీ తమకు గుర్తుండిపోతుందని అందరూ గర్వించే క్షణాలుగా తాము ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పారు. తనకు పుట్టిన ఆడ శిశువుకు సింధూర్ పేరు పెట్టుకోవడం గర్వకారణంగా భావిస్తున్నట్లు భతాహి బాబు గ్రామానికి చెందిన మరో మహిళ తెలిపింది. సింధూర్ పెరిగి పెద్దయిన తర్వాత తన పేరుకు అర్థం తెలుసుకొని భారతమాతకు పేరు తెస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పింది. ఆపరేషన్ సింధూర్‌కు గౌరవ సూచకంగా తన శిశువుకు సింధూర్ పేరు పెట్టుకున్నట్లు షడ్రౌనా ప్రాంతానికి చెందిన ప్రియాంక దేవి కూడా తెలిపారు.

దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు

ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.

ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది

మీ ఇంటిలోకి పాములు వస్తాయని భయపడుతున్నారా? ఈ మొక్కలు నాటి చూడండి!

అద్దెకు పెళ్లి కుమార్తె.. ఇదో వింత మోసం..వీడియో

మేకప్ ప్రొడక్ట్స్‌తో బీ అలర్ట్..పాపం ఆ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్..

'పెళ్లి ఓ టైం వేస్ట్!' నాగరికతకు దూరంగా గుహలో నివాసం..
