ఉలవలు తింటే మీ ఆరోగ్యం రేసు గుర్రమే..వీడియో
ఉలవలు మంచి బలవర్ధకమైన ఆహారం. ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పీచు పదార్థం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉలవలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది పేగు కండరాల కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు ఉలవలు తినడం వల్ల ఎంతో మంచిది. వీటిలో ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో దోహదపడుతుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది. కడుపు ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తినండి.
ఎక్కిళ్ళ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. జ్వరం, ఆయాసం, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు ఉలవల కషాయం తాగితే ఆ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది. మూత్ర సంబంధ సమస్యలు నివారించడంలో ఉలవలు సహాయపడతాయి. దీనికోసం ఒక కప్పు ఉలవ చారుకు సమానంగా కొబ్బరినీళ్లు తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ఉలవలు దోహదపడతాయి. వీటిలోని పోషకాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొమ్మును కరిగించడంలో ఉలవలు సహాయపడతాయి. తద్వారా గుండెకు రక్త సరఫరా మెరుగుపడుతుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. పిల్లల ఎదుగుదలకు ఉలవలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి పిల్లల శారీరక,మానసిక ఆరోగ్యానికి సహాయపడతాయి. వారికి బలాన్ని ఇస్తాయి. అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. ఉలవలు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని తగ్గిస్తాయి. చర్మ సమస్యలు నివారణలో కీళ్ళనొప్పుల నివారణలో బాగా పనిచేస్తాయి.

దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు

ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.

ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది

మీ ఇంటిలోకి పాములు వస్తాయని భయపడుతున్నారా? ఈ మొక్కలు నాటి చూడండి!

అద్దెకు పెళ్లి కుమార్తె.. ఇదో వింత మోసం..వీడియో

మేకప్ ప్రొడక్ట్స్తో బీ అలర్ట్..పాపం ఆ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్..

'పెళ్లి ఓ టైం వేస్ట్!' నాగరికతకు దూరంగా గుహలో నివాసం..
