పాకిస్తాన్‌ రాజకీయ సంక్షోభం కొలిక్కొస్తుందా ??

|

Feb 12, 2024 | 9:39 PM

దాయాది దేశం పాకిస్థాన్​లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ పార్టీ PML- N తమ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బిలావల్‌ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ PPP జరుపుతున్న చర్చల్లో పురోగతి సాధించింది. పీపీపీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ, అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీతో తమ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ ఆదివారం జరిపిన చర్చల్లో చాలా అంశాలపై సఖ్యత కుదిరినట్లు పీఎంఎల్‌-ఎన్‌ ప్రకటించింది.

దాయాది దేశం పాకిస్థాన్​లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ పార్టీ PML- N తమ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బిలావల్‌ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ PPP జరుపుతున్న చర్చల్లో పురోగతి సాధించింది. పీపీపీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ, అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీతో తమ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ ఆదివారం జరిపిన చర్చల్లో చాలా అంశాలపై సఖ్యత కుదిరినట్లు పీఎంఎల్‌-ఎన్‌ ప్రకటించింది. రాజకీయ అనిశ్చితి నుంచి దేశాన్ని రక్షించేందుకు ఇరు పార్టీల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని తెలిపింది. త్వరలో జరగబోయే సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో పీపీపీ నాయకత్వం వారి ప్రతిపాదనలను తమ ముందు ఉంచనున్నట్టు తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మారథాన్‌ ప్రపంచ రికార్డు విజేత దుర్మరణం

పూణె ప్రజలను హడలెత్తిస్తున్న దోమల సుడిగాలి

కులూలో పారాగ్లైడింగ్‌ చేస్తూ.. తెలంగాణ యువతి మృతి

హైదరాబాద్‌లో సనత్‌నగర్‌ – మౌలాలి MMTS రైలు మార్గం రెడీ

ఖతర్‌ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారులు విడుదల

Follow us on