Jackpot: రూ.34 కోట్ల జాక్ పాట్ కొట్టాడు.. అడ్రస్ లేకుండా పోయాడు..!
కొందరికి ఎప్పుడూ దురదృష్టం వెన్నంటే ఉన్నా.. ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం కూడా పలకరిస్తుంటుంది. కానీ దానిని వారు అందుకోలేరు. ఎందుకంటే.. దురదృష్టం అంటే అదేకదా మరీ.. అసలు విషయం ఏంటంటే.. ఓ ఎన్నారై వ్యక్తి లాటరీలో ఏకంగా 34 కోట్ల రూపాయలు జాక్‌పాట్ కొట్టాడు. ఆ విషయం అతనికి చెబుదామని లాటరీ నిర్వాహకులు ఫోన్ చేస్తే అతనినుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట.
కొందరికి ఎప్పుడూ దురదృష్టం వెన్నంటే ఉన్నా.. ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం కూడా పలకరిస్తుంటుంది. కానీ దానిని వారు అందుకోలేరు. ఎందుకంటే.. దురదృష్టం అంటే అదేకదా మరీ.. అసలు విషయం ఏంటంటే.. ఓ ఎన్నారై వ్యక్తి లాటరీలో ఏకంగా 34 కోట్ల రూపాయలు జాక్‌పాట్ కొట్టాడు. ఆ విషయం అతనికి చెబుదామని లాటరీ నిర్వాహకులు ఫోన్ చేస్తే అతనినుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. అబుదాబిలో ఉంటున్న ఒక ఎన్నారై అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్ లాటరీలో 15 మిలియన్ దిర్హమ్ లు గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో ఇది అక్షరాలా 33.99 కోట్లు. ఖతార్ లో ఉండే ముజీబ్ తెక్కే మట్టియేరి అనే భారతీయుడికి ఈ జాక్ పాట్ తగిలింది. సెప్టెంబర్ 27వ తేదీన లాటరీ టికెట్ ను ఆయన ఆన్ లైన్ లో కొనుగోలు చేశాడు. అతను కొనుగోలు చేసిన టికెట్ కు ఈ పెద్దమొత్తం లాటరీ తగిలింది. లాటరీ గెలిచిన విషయాన్ని ఆయనకు చెప్పడానికి నిర్వాహకులు ఫోన్ చేసినా ఆయననుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఇతర మార్గాల్లో ప్రయత్నించి లాటరీ డబ్బును ఆయనకు అందజేస్తామని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..