గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ కార్డు

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ కార్డు

Phani CH

|

Updated on: Oct 28, 2023 | 9:52 AM

అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డు పొందాలంటే దరఖాస్తుదారులు చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇలాంటి వారికి ఊరట కలిగించే దిశగా నిర్ణయం తీసుకుంది. గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు చేసుకునేవారికి తొలిదశలోనే ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ కార్డు (EAD) అందజేయాలని వైట్‌హౌస్‌ కమిషనర్‌ అక్టోబరు 26న ప్రభుత్వానికి అధికారికంగా సిఫార్స్‌ చేశారు. అధ్యక్షుడు జో బైడెన్‌ ఆమోద ముద్ర వేస్తే ఈఏడీ మంజూరు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డు పొందాలంటే దరఖాస్తుదారులు చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇలాంటి వారికి ఊరట కలిగించే దిశగా నిర్ణయం తీసుకుంది. గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు చేసుకునేవారికి తొలిదశలోనే ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ కార్డు (EAD) అందజేయాలని వైట్‌హౌస్‌ కమిషనర్‌ అక్టోబరు 26న ప్రభుత్వానికి అధికారికంగా సిఫార్స్‌ చేశారు. అధ్యక్షుడు జో బైడెన్‌ ఆమోద ముద్ర వేస్తే ఈఏడీ మంజూరు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దీనివల్ల లక్షలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దీంతో పాటూ గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రక్రియలో పలు కీలక మార్పులు సూచించింది. ప్రస్తుత ప్రక్రియ ప్రకారం, గ్రీన్ కార్డు కోసం అభ్యర్థులు మొదట ఐ-140 దరఖాస్తు చేయాలి. ఆ తరువాత ఈ ప్రక్రియ కీలక దశకు చేరుతుంది. ఈ దశలో స్టేటస్ సర్దుబాటు జరుగుతుంది. దీన్ని ఐ-485గా పిలుస్తారు. ఈ దశలోనే ఈఏడీ కార్డు, ఇతర ట్రావెల్ డాక్యుమెంట్ల అడ్వాన్స్ పెరోల్‌ను జారీ చేస్తారు. దీంతో, అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా పనిచేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. తాజా సిఫార్సు అమల్లోకి వస్తే ప్రభుత్వం ఐ-140 దశలోనే ఈఏడీ జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలు తరబడి వేచి చూడాల్సి వస్తున్నందున ఈ సిఫారసు భారతీయులకు మేలు కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హెలికాఫ్టర్‌ నుంచి డాలర్ల వర్షం.. ఏరుకోవడానికి ఎగబడ్డ జనం..

Salaar: అప్పుడే 175 కోట్ల కలెక్షన్స్‌.. కళ్లుతిరిగేలా చేస్తున్న సలార్ క్రేజ్‌

Sitara Ghattamaneni: సీతూపాప లెహంగా ధరతో… ఏకంగా చిన్న బట్టలకొట్టే పెట్టేయొచ్చు

ఆ ఒక్క సినిమా చేసుకుంటేనా.. నాగచైతన్య రేంజ్‌ మారిపోయేదేమో..

అబ్బా… వీరిద్దరి కాంబోలో.. మంచి సినిమా మిస్సైంది కదా…