సిడ్నీలో నారా లోకేశ్​ … ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ మెక్కేతో భేటీ వీడియో

Updated on: Oct 20, 2025 | 2:01 PM

ఆస్ట్రేలియా పర్యటనలో తొలిరోజే ఏపీ మంత్రి నారా లోకేశ్ పెట్టుబడులపై దృష్టి సారించారు. సిడ్నీలో ఆస్ట్రేలియా ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్కేతో సమావేశమై, ఏపీలోని పారిశ్రామిక క్లస్టర్‌లలో పెట్టుబడులకు సహకరించాలని కోరారు. ఇంధనం, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాల్లో భాగస్వామ్యం కోసం విజ్ఞప్తి చేశారు.

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలిరోజునే ఏపీ మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించారు. సిడ్నీలో ఆస్ట్రేలియా ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్కేతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ను కీలక పెట్టుబడులకు గమ్యస్థానంగా పేర్కొంటూ, ఆస్ట్రేలియా ఇండియా సీఈవో ఫోరం స్టేట్ ఎంగేజ్‌మెంట్ అజెండాలో ఏపీని చేర్చాలని కోరారు. ఏపీలోని ఇండస్ట్రియల్ క్లస్టర్‌లలో పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా కంపెనీలకు నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఇంధనం, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాల పెట్టుబడుల్లో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. ఏపీలోని కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం వంటి పారిశ్రామిక క్లస్టర్‌లలో ఆస్ట్రేలియా కంపెనీలు భాగస్వామ్యం వహించేలా సహకారం అందించాల్సిందిగా కోరారు.

మరిన్ని వీడియోల కోసం :

నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?

హైదరాబాద్‌ బిర్యానీ కోసం బిహార్‌లో ఫైటింగ్‌ వీడియో

ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా

డ్యాన్స్‌లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో