పర్వతం కూలితే పండుగ చేసుకున్నారు.. ఎందుకంటే ??

|

Nov 27, 2024 | 7:26 PM

నదులు, పర్వత ప్రాంతాలకు సమీపంలో ఉండే ప్రజల జీవితం మిగతా వారి కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. ప్రకృతి ఒడిలో బతికే వీరు ఇతరుల కంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే ప్రకృతి విలయాలు మాత్రం వీరిని ఎప్పుడూ భయపెడుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ ముప్పు వచ్చి పడుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. ఆ ఊరి వాళ్లకూ అదే భయం.

పర్వతానికి దగ్గర్లో ఉండే అక్కడి ప్రజలు పలు ఉత్పాతాలు చూశారు. మళ్లీ ఏది తమ మీదకు వచ్చి పడుతుందోనని వణికిపోయారు. కానీ ఈసారి వాళ్లకు అదృష్టం కలిసొచ్చింది. పర్వతం కూలినా వాళ్ల పంట పండింది. దీంతో వాళ్ల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అసలు ఆ గ్రామం ఎక్కడ ఉంది? అక్కడి వాళ్లు ఎందుకంత సంతోషంగా ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఓ పర్వతం కూలిపోయింది. పర్వతం కూలితే పెద్ద విశేషం ఏం ఉంది అనుకోకండి. అది కూలడంతో అక్కడి ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. పర్వతం కూలితే ప్రజలకు ఇబ్బందే కదా! ప్రకృతి విలయంతో వాళ్లు ఎంతో బాధపడి ఉంటారు కదా? మరి పండుగ అంటారే అనేదేగా మీ సందేహం. పర్వతం కూలడంతో అందులో నుంచి విలువైన రాగి నిక్షేపాలు బయటపడ్డాయి. టన్నుల కొద్దీ రాగి బయటపడటంతో అక్కడి ప్రజలు సంతోషంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కల్తీ ఆహారం మన పొట్టలో చేరితే ఏమవుతుందో తెలుసా ??

సంతోషంగా స్నేహితుడి పెళ్లికి వెళ్లాడు.. గిఫ్ట్‌ ఇస్తూ ఒక్కసారిగా..

ఒక్క నెలలో.. కోటి మంది కస్టమర్లు గోవిందా

శీతాకాలం సూపర్ ఫుడ్‌గా తేగలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

పిల్లల కోసం తిండి మానేస్తున్న తల్లిదండ్రులు