మిస్ వరల్డ్ పోటీలకు పాకిస్తాన్ దూరం వీడియో
72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ నగరంలో అంతా సిద్ధమైంది. ప్రపంచ దేశాల సుందరి మణులు నగరానికి చేరుకుంటున్నారు. 116 దేశాలకు చెందిన అందగత్తలు పాల్గొంటున్న మిస్ వరల్డ్ పోటీలు 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. మిస్ వరల్డ్ వివిధ దేశాల పోటీ దారులు బస చేస్తున్న హోటల్ దగ్గర ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు.
మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొత్త సంధడి నెలకొంది. ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్న సుందరి మణులకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక భద్రతతో పాటు స్వాగతం పలుకుతూ హోల్డింగ్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో జరిగే ప్రపంచ సుందరి పోటీలకు పాకిస్తాన్ దూరంగా ఉండనున్నది. ప్రపంచ సుందరి పోటీల్లో పాకిస్తాన్ పాల్గొనడం లేదని కన్ఫర్మ్ చేసింది మిస్ వరల్డ్ టీం. మరోవైపు మిస్ వరల్డ్ పోటీల్లో పాకిస్తాన్ లేదని టీవీ నైన్ తో జే యస్ రంజన్ తెలిపారు. ప్రపంచ సుందరి పోటీల్లో పాకిస్తాన్ పాల్గొనడం లేదనే అంశాన్ని విస్తృత ప్రచారం చేయాలని ఆయన కోరారు.
మరిన్ని వీడియోల కోసం :