మారథాన్‌ ప్రపంచ రికార్డు విజేత దుర్మరణం

|

Feb 12, 2024 | 9:38 PM

కెన్యా అథ్లెట్‌, మారథాన్‌ ప్రపంచ రికార్డు విజేత కెల్విన్‌ కిప్టం దుర్మరణం పాలయ్యారు. ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో 24 ఏళ్ల ఈ యువ అథ్లెట్‌ మరణించాడు. ఆ సమయంలో కెల్విన్‌తో పాటు కారులో ఉన్న అతడి కోచ్‌ గెర్వాస్‌ హాకిజిమనా కూడా కన్నుమూశారు. ఈ ఘటన క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం నింపింది. కెల్విన్‌, గెర్వాస్‌ హఠాన్మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని.. వారి ఆత్మలకు శాంతి కలగాలంటూ వరల్డ్‌ అథ్లెటిక్స్‌ అధ్యక్షుడు సెబాస్టియన్‌ కోయే విచారం వ్యక్తం చేశారు.

కెన్యా అథ్లెట్‌, మారథాన్‌ ప్రపంచ రికార్డు విజేత కెల్విన్‌ కిప్టం దుర్మరణం పాలయ్యారు. ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో 24 ఏళ్ల ఈ యువ అథ్లెట్‌ మరణించాడు. ఆ సమయంలో కెల్విన్‌తో పాటు కారులో ఉన్న అతడి కోచ్‌ గెర్వాస్‌ హాకిజిమనా కూడా కన్నుమూశారు. ఈ ఘటన క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం నింపింది. కెల్విన్‌, గెర్వాస్‌ హఠాన్మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని.. వారి ఆత్మలకు శాంతి కలగాలంటూ వరల్డ్‌ అథ్లెటిక్స్‌ అధ్యక్షుడు సెబాస్టియన్‌ కోయే విచారం వ్యక్తం చేశారు. పురుషుల మారథాన్‌ ఈవెంట్లో కెల్విన్‌ కిప్టం ప్రపంచ రికార్డు సాధించారు. అక్టోబరు 8, 2023లో చికాగో మారథాన్‌లో పాల్గొన్న ఆయన రెండు గంటల 35 సెకండ్లలోనే పరుగు పూర్తి చేసి, రెండుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌గా నిలిచిన ఎల్యూడ్‌ కిచోగ్‌ పేరిట ఉన్న వరల్డ్‌ రికార్డును బద్దలు కొట్టారు. ఎల్యూడ్‌ కంటే 34 సెకండ్ల ముందే లక్ష్యాన్ని చేరుకుని ఈ ఘనత సాధించారు. పారిస్‌ ఒలింపిక్స్‌-2024 లక్ష్యంగా ముందుకు సాగుతున్న కెల్విన్‌ హఠాన్మరణం క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పూణె ప్రజలను హడలెత్తిస్తున్న దోమల సుడిగాలి

కులూలో పారాగ్లైడింగ్‌ చేస్తూ.. తెలంగాణ యువతి మృతి

హైదరాబాద్‌లో సనత్‌నగర్‌ – మౌలాలి MMTS రైలు మార్గం రెడీ

ఖతర్‌ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారులు విడుదల

విమానంలో చక్కర్లు .. మహిళ ఇంటిపై టమాటాలు విసురుతూ టీజింగ్‌

Follow us on