వాళ్లకు పిల్లలు పుట్టకుండా చెయ్యడానికి మీకేం హక్కుంది ??

|

Jul 08, 2024 | 9:37 PM

జపాన్‌లో బలవంతంగా సంతానశక్తి తొలగించినందుకుగాను బాధితులకు తగిన పరిహారం చెల్లించవలసిందిగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం బుధవారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. వైకల్యమున్న వ్యక్తుల్లో సంతాన నిరోధానికిగాను రూపొందించిన యూజెనిక్స్‌ రక్షణ చట్టం కింద ఈ ‘స్టెరిలైజేషన్లు’ చేశారు. ఇలా 1950 నుంచి 1970 మధ్య దాదాపు 25,000 మందికి వారి అనుమతితో పని లేకుండా సంతాన నిరోధక చికిత్సలు నిర్వహించారు.

జపాన్‌లో బలవంతంగా సంతానశక్తి తొలగించినందుకుగాను బాధితులకు తగిన పరిహారం చెల్లించవలసిందిగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం బుధవారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. వైకల్యమున్న వ్యక్తుల్లో సంతాన నిరోధానికిగాను రూపొందించిన యూజెనిక్స్‌ రక్షణ చట్టం కింద ఈ ‘స్టెరిలైజేషన్లు’ చేశారు. ఇలా 1950 నుంచి 1970 మధ్య దాదాపు 25,000 మందికి వారి అనుమతితో పని లేకుండా సంతాన నిరోధక చికిత్సలు నిర్వహించారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత జపాన్‌లో జరిగిన అతిపెద్ద మానవహక్కుల ఉల్లంఘనగా దీన్ని బాధితుల తరఫు న్యాయవాదులు అభివర్ణించారు. 1948 నాటి ఈ యూజెనిక్స్‌ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న కోర్టు ప్రభుత్వ వాదనను తిరస్కరించింది. సర్కారు ఆధ్వర్యంలో దశాబ్దాల తరబడి వివక్ష, మానవహక్కుల ఉల్లంఘన కొనసాగడం చాలా తీవ్రమైన విషయంగా పేర్కొంది. ఫిర్యాదుదారుల్లో కొందరు దిగువస్థాయిలో అయిదు కోర్టుల దాకా పోరాడి సుప్రీంకోర్టుకు వచ్చారు. వీల్‌ఛైర్లలో కోర్టుకు వచ్చిన కొందరు బాధితులు న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అచ్చం సినిమాటిక్‌ స్టైల్లో.. దొంగల కోసం ఛేజింగ్‌

నడిరోడ్డుపై దారుణం.. ఆటోవాలాను రక్తమోడేలా కొట్టిన యువతి

మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగాల కోత !! తొలగించినట్లు తెలిపిన ఓ మీడియా సంస్థ

అనంత్‌ అంబానీ – రాధికా మర్చెంట్‌ ‘మామెరు’ ఫంక్షన్‌.. ఇదేం వేడుక ??

బైకు సర్వీసింగ్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. ఏంటా అని చూసిన మెకానిక్‌ షాక్‌..