Al Jazeera: కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.

|

Sep 27, 2024 | 7:58 PM

ఇజ్రాయెల్ తాజాగా వెస్ట్ బ్యాంక్ లోని ఓ మీడియా సంస్థపై దాడి చేసింది. భారీగా ఆయుధాలు ధరించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సైనికులు ఆల్ జజీరా ఆఫీసులోకి చొరబడ్డారు. అక్కడున్న జర్నలిస్టుల కెమెరాలు తీసుకుని ఉన్నఫళంగా ఆఫీసును ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇదంతా ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నప్పటికీ వారు వెనకాడలేదు. ముఖానికి మాస్క్ తగిలించుకున్న సైనికులు ఆయుధాలతో తమను బెదిరించి ఖాళీ చేయించారని ఆల్ జజీరా సిబ్బంది వాపోయారు.

ఈ సందర్భంగా ఓ సైనికుడు చెప్పిన మాటలను ఆల్ జజీరా జర్నలిస్టులు లైవ్ లో తెలిపారు. 45 రోజుల్లోగా ఆల్ జజీరా ఆఫీసును క్లోజ్ చేయాలంటూ కోర్టు ఆదేశించిందని గుర్తుచేస్తూ.. ఇక్కడున్న వారంతా కెమెరాలన్నీ తీసుకుని బయటకు వెళ్లిపోవాలని సదరు సైనికుడు అరబిక్ లో చెప్పాడన్నారు. జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిందంటూ తమ దేశంలో ఆల్ జజీరా మీడియా సంస్థను ఇజ్రాయెల్ గతంలోనే బ్యాన్ చేసింది. గత మే నెలలో జెరూసలెంలోని ఓ హోటల్ లో నిర్వహిస్తున్న ఆల్ జజీరా ఆఫీసుపైనా ఇజ్రాయెల్ అధికారులు దాడి చేశారు. ఇటీవల గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులలో ఆల్ జజీరా జర్నలిస్టు ఇస్మాయిల్ అల్ గౌహల్ మరణించారు.

అక్టోబర్ 7న ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లో హమాస్ ఉగ్రవాదులు మారణహోమం జరిపారు. ఆ దుర్ఘటనలో ఇస్మాయిల్ కూడా పాలుపంచుకున్నాడని ఇజ్రాయెల్ మిలటరీ ఆరోపిస్తోంది. హమాస్ ఆదేశాలతో ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన నుఖుబా యూనిట్ అక్టోబర్ 7 దాడికి పాల్పడిందని, ఇస్మాయిల్ కూడా ఈ యూనిట్ సభ్యుడేనని వాదిస్తోంది. వెస్ట్ బ్యాంక్ లో ఆదివారం ఇజ్రాయెల్ సైనికులు తమ ఆఫీసులోకి చొచ్చుకెళ్లి తమ సిబ్బందిని బలవంతంగా ఖాళీ చేయించడంపై ఆల్ జజీరా యాజమాన్యం మండిపడింది. మీడియాను ఇజ్రాయెల్ ఉక్కుపాదంతో అణచివేస్తోందని ఆరోపించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on