Israel – Iran: అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

|

Apr 20, 2024 | 10:04 AM

ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది. ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్ పై క్షిపణులను ప్రయోగించింది. ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ మిస్సైల్స్ ను ప్రయోగించినట్టు అమెరికాకు చెందిన ఒక అధికారి తెలిపారు. పెద్ద శబ్దాలు వినిపించినట్టు ఇరాన్ స్థానిక మీడియా కూడా తెలిపింది. తమ దేశంపై పరిమిత స్థాయిలో దాడులకు దిగినా.. ఇజ్రాయెల్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ ప్రధాని..

ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది. ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్ పై క్షిపణులను ప్రయోగించింది. ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ మిస్సైల్స్ ను ప్రయోగించినట్టు అమెరికాకు చెందిన ఒక అధికారి తెలిపారు. పెద్ద శబ్దాలు వినిపించినట్టు ఇరాన్ స్థానిక మీడియా కూడా తెలిపింది. తమ దేశంపై పరిమిత స్థాయిలో దాడులకు దిగినా… ఇజ్రాయెల్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ ప్రధాని హెచ్చరించిన ఒక రోజు వ్యవధిలోనే ఇజ్రాయెల్ దాడులు చేసింది. తాము తీవ్ర దాడులకు దిగితే ఇజ్రాయెల్ మిగలదని కూడా ఇరాన్ ప్రధాని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఉదయం ఇరాన్ లోని ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఇస్ఫహాన్ ఇరాన్ అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది. అతిపెద్ద సైనిక శిబిరం కూడా ఈ నగరంలో ఉంది. మరోవైపు ఇరాన్ తన గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్టు అక్కడి అధికార మీడియా ఐఆర్ఎన్ఏ తెలిపింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను సైతం యాక్టివేట్ చేసింది.

ఇజ్రాయెల్ ప్రయోగించిన పలు డ్రోన్లను మధ్యలోనే కూల్చివేసినట్టు ఇరాన్ తెలిపింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ మిస్సైల్ ను ప్రయోగించలేదని వెల్లడించింది. ఇరాన్ పై దాడులకు సంబంధించి ఇప్పుడు ఎలాంటి ప్రకటన చేయలేమని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఉన్న ఖొమైనీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును పూర్తిగా మూసివేశారు. విమాన రాకపోకలను ఆపివేశారు. ఈ ఉదయం ఇరాన్ కు వస్తున్న ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ విమానాలు మార్గమధ్యంలోనే వెనక్కి తిరిగాయి. గత వారాంతంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ వందలాది డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. వీటన్నింటిని ఇజ్రాయెల్ నిర్వీర్యం చేసింది. ఈ దాడులకు ప్రతీకారంగానే ఈ తెల్లవారుజామున దాడులకు దిగింది. ప్రస్తుత పరిణామాలతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు యుద్ధానికి దారి తీస్తాయేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!