Zara Esmaeili: హిజాబ్ ధరించనందుకు అరెస్టు.. ఆ వెంటనే మిస్సింగ్‌ కూడా.!

|

Aug 10, 2024 | 6:00 PM

ఇరాన్‌లో మరోసారి హిజాబ్ అంశం తెరపైకొచ్చింది. హిజాబ్‌ ధరించకుండా ఓ మహిళా సింగర్‌ రోడ్డు మీద పాట పాడి, అరెస్టయ్యారు. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ లేకుండా పోయిందని తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్‌కు చెందిన జారా ఇస్మాయిలీ అనే యువతి.. ఇంగ్లీష్ గాయని రాసిన పాటను పబ్లిక్‌గా పాడారు. అప్పుడు ఆమె హిజాబ్ ధరించలేదు. ఆ దృశ్యాలు వైరల్‌ కావడంతో ఇటీవల పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

ఇరాన్‌లో మరోసారి హిజాబ్ అంశం తెరపైకొచ్చింది. హిజాబ్‌ ధరించకుండా ఓ మహిళా సింగర్‌ రోడ్డు మీద పాట పాడి, అరెస్టయ్యారు. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ లేకుండా పోయిందని తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్‌కు చెందిన జారా ఇస్మాయిలీ అనే యువతి.. ఇంగ్లీష్ గాయని రాసిన పాటను పబ్లిక్‌గా పాడారు. అప్పుడు ఆమె హిజాబ్ ధరించలేదు. ఆ దృశ్యాలు వైరల్‌ కావడంతో ఇటీవల పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు ఆమె ఆచూకీ మిస్‌ అయింది. ఆమె ఎక్కడుందో తెలియడం లేదని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నట్లు ఈ పరిణామాలతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి వెల్లడించారు.

1979 ఇస్లామిక్ విప్లవం నుంచి ఇరాన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరిగా అమలుచేస్తున్నారు. అయితే చాలామంది మహిళలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ జారా ఇస్మాయిలీ కూడా ఆ కోవకు చెందిన మహిళే. ఆమె బహిరంగ ప్రదేశాలైన మెట్రో, పార్కుల్లో హిజాబ్‌ లేకుండానే ప్రదర్శనలు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ఆమె అరెస్టు జరిగింది. అయితే దీనిని పలువురు ఖండిస్తున్నారు. ఇప్పుడు ఆమె జాడ కూడా తెలియడం లేదనే వార్తలు జారా కుటుంబ సభ్యులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.

సరిగ్గా రెండేళ్లక్రితం ఇరాన్‌ను హిజాబ్‌ నిరసనలు కుదిపేసాయి. మాసా అమీని అనే యువతి హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి పోలీసులు అరెస్టు చేయగా.. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ మృతి వార్తతో వేల మంది మహిళలు రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు. వారికి అంతర్జాతీయ సమాజం మద్దతు తెలిపింది. ఆందోళనకారులపై టెహ్రాన్ ఉక్కుపాదం మోపడాన్ని ఖండించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.