Kim Jong Un: సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!

తన అధికారానికి అడ్డం వస్తారని అనుమానిస్తే సొంత వారిని కూడా ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వదిలిపెట్టరు. గతంలో సవతి సోదరుడిపైనే విషప్రయోగం చేయించిన ఆయన.. తాజాగా నానమ్మపై ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. ఆమె రాజభవనాన్ని బుల్‌డోజర్లతో కూలగొట్టాడు. కిమ్‌ తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌ తొలి భార్య కుమారుడి వారసుడే కిమ్‌ జోంగ్‌ ఉన్‌. ఇక భార్య మరణంతో ఇల్‌ సంగ్‌ రెండో వివాహం చేసుకొన్నారు.

Kim Jong Un: సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!

|

Updated on: Aug 10, 2024 | 5:53 PM

తన అధికారానికి అడ్డం వస్తారని అనుమానిస్తే సొంత వారిని కూడా ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వదిలిపెట్టరు. గతంలో సవతి సోదరుడిపైనే విషప్రయోగం చేయించిన ఆయన.. తాజాగా నానమ్మపై ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. ఆమె రాజభవనాన్ని బుల్‌డోజర్లతో కూలగొట్టాడు. కిమ్‌ తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌ తొలి భార్య కుమారుడి వారసుడే కిమ్‌ జోంగ్‌ ఉన్‌. ఇక భార్య మరణంతో ఇల్‌ సంగ్‌ రెండో వివాహం చేసుకొన్నారు. ఆమె పేరు కిమ్‌ సంగ్‌ ఏ. వీరి సంతానానికి వారసత్వం అప్పగించేందుకు యత్నాలు జరిగినట్లు తెలియడంతో అంతఃపుర వైరం మొదలైంది.

ప్రస్తుత నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ ఆమెను 1994లో హాప్‌జాంగ్‌ ప్యాలెస్‌ అనే భవనంలో నిర్బంధించారు. అప్పటికే కిమ్‌ తాత ఇల్‌ సంగ్‌ మరణించారు. ఇది దేశరాజధాని ప్యాంగ్యాంగ్‌-ప్యాంగ్‌సంగ్‌కు మధ్యలోని ఓ పర్వత ప్రాంతంలో ఉంది. ఇక్కడ దాదాపు 11 హెక్టార్లలో అటవీ ప్రాంతం, హాప్‌జాంగ్‌ నది ఉన్నాయి. ప్రత్యేక భద్రతా సిబ్బంది రక్షణ, ఇతర ఉద్యోగులు ఇక్కడ పనిచేసేవారు. ఇక తన తండ్రి రెండో భార్య కుమారుడు కిమ్‌ ప్యాంగ్‌ ఇల్‌ను దౌత్యవేత్త బాధ్యతలపై ప్రవాసానికి పంపించారు. అంతకు మించి ఆయన తన సవతి తల్లికి హాని తలపెట్టాలని చూడలేదు. 2014లో కిమ్‌ సంగ్‌ ఏ మరణించారు. తాజాగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆ ప్యాలెస్‌ను బుల్‌డోజర్ల సాయంతో నేల మట్టం చేయించారు. ఉపగ్రహ చిత్రాల్లో ఆ భవనం ఆనవాళ్లు కూడా లభించని విధంగా ఆ ప్రదేశాన్ని చదును చేయించారు. గతంలో ఈ దేశ ఉన్నతాధికారుల విల్లాలను కూడా కూల్చివేసిన చరిత్ర ఉంది. పాత భవనాలు కావడంతో కూల్చేస్తున్నారా..? లేదా వీటి నిర్వహణ నిధులను మిగుల్చుకునేందుకు ఇలా చేస్తున్నారా అనేది తెలియరాలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..
వారికి తాము చనిపోతామని ముందే తెలిసిపోయిందా.? విషాద ప్రయాణం..
వారికి తాము చనిపోతామని ముందే తెలిసిపోయిందా.? విషాద ప్రయాణం..
శివంగిలా దూకి.. ఎనిమిది మందితో తండ్రిని రక్షించుకుంది.!
శివంగిలా దూకి.. ఎనిమిది మందితో తండ్రిని రక్షించుకుంది.!
హిట్టా.? ఫట్టా.? హృదయాలను కదిలిస్తున్న కమిటీ కుర్రోళ్ళు.!
హిట్టా.? ఫట్టా.? హృదయాలను కదిలిస్తున్న కమిటీ కుర్రోళ్ళు.!
భారత్‌ వైపు దూసుకొస్తున్న బంగ్లాదేశీయులు. బోర్డర్‌ దగ్గర హైఅలర్ట్
భారత్‌ వైపు దూసుకొస్తున్న బంగ్లాదేశీయులు. బోర్డర్‌ దగ్గర హైఅలర్ట్
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గదిలోకెళ్లిన అరగంటకే ఊహించని సీన్
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గదిలోకెళ్లిన అరగంటకే ఊహించని సీన్
1.21 కోట్ల విరాళం.. ఎంతైనా అక్షయ్ పాజీ గ్రేట్ !!
1.21 కోట్ల విరాళం.. ఎంతైనా అక్షయ్ పాజీ గ్రేట్ !!