Iran Warning: 'మా వేళ్లు ట్రిగ్గర్ మీదే ఉన్నాయ్‌'.! ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్.!

Iran Warning: ‘మా వేళ్లు ట్రిగ్గర్ మీదే ఉన్నాయ్‌’.! ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్.!

Anil kumar poka

|

Updated on: Oct 18, 2023 | 8:24 PM

పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు అపాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. దురాక్రమణలు ఆపకపోతే పశ్చిమాసియాలోని అన్ని దేశాల వేళ్లూ ట్రిగ్గర్ మీదే ఉన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ హెచ్చరించారు. 'ప్రస్తుతం యుద్ధం మరింత ఉదృతం కాకుండా నిరోధించాలంటే ఒక్కటే మార్గమన్నారు.

పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు అపాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. దురాక్రమణలు ఆపకపోతే పశ్చిమాసియాలోని అన్ని దేశాల వేళ్లూ ట్రిగ్గర్ మీదే ఉన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ హెచ్చరించారు. ‘ప్రస్తుతం యుద్ధం మరింత ఉదృతం కాకుండా నిరోధించాలంటే ఒక్కటే మార్గమన్నారు. గాజాలో పౌరులకు వ్యతిరేకంగా జరుగుతున్న అనాగరిక దాడులను నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు హుస్సేన్. ఇదిలా ఉంటే.. గాజాపై భూతల దాడులు చేయడానికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతోంది. హమాస్‌ ఉనికి లేకుండా చేస్తానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఈ దాడుల్లో ఇప్పటికే 700 మంది పిల్లలతో పాటు 2,670 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌ వైపు 1400 మంది మరణించారు. కాగా హమాస్ దాడులు వెనక తమ ప్రమేయం లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే స్పష్టం చేశారు. పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చారు. అయితే హమాస్ బృందాలకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారని ఇరాన్‌పై ఇజ్రాయెల్ మొదటి నుంచీ ఆరోపణలు గుప్పిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..