భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు

|

Apr 27, 2024 | 8:42 PM

పాకిస్థాన్‌ను తీవ్ర ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలలో భాగంగా భారత్‌తో బిజినెస్‌ కార్యకలాపాలు మొదలుపెట్టాలనే వాదన పాక్‌ వ్యాపారుల నుంచి మొదలైంది. భారత్‌తో వాణిజ్య చర్చలు జరపాలని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు వారు విజ్ఞప్తి చేశారు. వ్యాపారవేత్తలతో మంతనాలు జరిపిన ప్రధాని బంగ్లాదేశ్‌ ఆర్థిక వృద్ధిని ఉదహరించారు. ఒకప్పుడు భారం అనుకున్న దేశాన్ని చూసి సిగ్గుపడుతున్నామని అన్నారు.

పాకిస్థాన్‌ను తీవ్ర ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలలో భాగంగా భారత్‌తో బిజినెస్‌ కార్యకలాపాలు మొదలుపెట్టాలనే వాదన పాక్‌ వ్యాపారుల నుంచి మొదలైంది. భారత్‌తో వాణిజ్య చర్చలు జరపాలని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు వారు విజ్ఞప్తి చేశారు. వ్యాపారవేత్తలతో మంతనాలు జరిపిన ప్రధాని బంగ్లాదేశ్‌ ఆర్థిక వృద్ధిని ఉదహరించారు. ఒకప్పుడు భారం అనుకున్న దేశాన్ని చూసి సిగ్గుపడుతున్నామని అన్నారు. ఎగుమతుల ద్వారా ఆర్థిక వ్యవస్థను పెంపొందించే మార్గాలపై పాకిస్థాన్‌ వ్యాపారవేత్తలతో ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇటీవల భేటీ అయ్యారు. వారి నుంచి ప్రశ్నలు, సలహాలు చెప్పేందుకు అవకాశమిచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఆరీఫ్‌ హబీబ్‌ సంస్థ అధినేత మాట్లాడుతూ.. పాక్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరతపై ఆందోళన తగ్గించేందుకు భారత్‌తోనూ చర్చలు జరపాలని సూచించారు. అది ఆర్థికవ్యవస్థకు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని అన్నారు. అడియాలా జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తోనూ సంప్రదింపులు జరపాలనీ సమస్యల పరిష్కారాలకు మరిన్ని అడుగులు వేయాలని ప్రధానికి సూచించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??

17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే

పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??

అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??

WhatsApp: మీరు ఇలా అడిగితే.. మేము భారత్ నుంచి నిష్క్రమిస్తాం

Follow us on